గ్రహణ సమయంలో దర్భలు ఎందుకు వాడుతారు.? వీటి ప్రాముఖ్యత ఏంటి.?
06 September 2025
Prudvi Battula
హిందూ మతంలో గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఆదివారం ఏర్పడేది సంపూర్ణ చంద్ర గ్రహణం భారతదేశం సహా అనేక దేశాల్లో కనిపిస్తుంది.
ముఖ్యంగా గ్రహణం సమయంలో ఇంట్లో నిల్వ ఉన్న ఆహార పదార్ధాలపై దర్భ వేసి ఉంచాలని వేద పండితులు సూచిస్తున్నారు.
హిందువులకు దర్భలు చాలా పవిత్రమైనవి. అందుకే వాటిని ప్రతికూలత పోవడానికి వివిధ కార్యాలలో వివిధ రకాలుగా వాడుతుంటారు.
సెప్టెంబర్ 7 ఆదివారం నాడు ఏర్పడేది చంద్రగ్రహణం. ఈ సమయంలో రాహువు చెడు దృష్టి చంద్రుడి నుంచి వచ్చే నీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఈ సమయంలో ఆహార పదార్ధాలపై చంద్రుని కిరణాలు, రాహువు చెడు దృష్టి పడినప్పటికీ ఎలాంటి నష్టం కలగకుండా దర్భలు ఆహార పదార్థాల్లో, ధాన్యాల్లో వేసి ఉంచుతారు.
ఖగోళశాస్త్రవేత్తలు ప్రకారం... గ్రహణ సమయంలో చంద్రుడు నుంచి కాస్మొటిక్ రేడియేషన్ వస్తుంది. దాన్ని హరించే శక్తి దర్భలకు ఉందని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే ఈ సమయంలో తినే పదార్ధాలపై దర్భలను ఉంచితే రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తాయని అంటున్నారు నిపుణులు.
గ్రహణం సమయంలో ప్రమాదకరమైన భూమిపై పడే అతినీలలోహిత కిరణాలు శక్తిని బలహీన పరిచేందుకు ఆహార పదార్థాలను ముట్టకూడదని పెద్దలు అంటారు.
ఈ సమయంలో అన్ని ఆలయాలు మూసి గ్రహణం విడిచాక సంప్రోక్షణ చేయడం వల్ల కిరణాల విషప్రభావాన్ని తొలగిస్తాయని నమ్మకం.
మరిన్ని వెబ్ స్టోరీస్
సెప్టెంబర్ నెలలో ఈ రాశులవారికి మహర్దశ.. పట్టిందల్లా బంగారమే..
మీ బ్లడ్ గ్రూపే మీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది.. ఎలా అంటారా.?
గ్రీన్ యాపిల్ మీ డైట్లో ఉంటే.. ఆ సమస్యలకు బెర్త్ ఫిక్స్ అయినట్టే..