దీపావళికి పటాకులు పేల్చినప్పుడు.. కాలితే.. ఇలా చెయ్యండి..
18 October 2025
Prudvi Battula
Images: Pinterest
గాయపడిన ప్రాంతాన్ని వెంటనే 10 నిమిషాలు ప్రవహించే నీటి కింద ఉంచి చల్లబరచాలి. అయితే, దానిని చల్లని నీటిలో ముంచవద్దు.
ప్రవహించే నీటిలో కడగాలి
కాలిన ప్రదేశంలో టూత్‌పేస్ట్, నెయ్యి, నూనె మొదలైన వాటిని పూయకుండా ఉండండి. ఇలా చేస్తే గాయం పెద్దది అవుతుంది.
టూత్‌పేస్ట్, నెయ్యిని నివారించండి
పటాకుల వల్ల కలిగిన గాయాన్ని శుభ్రమైన కాటన్ వస్త్రంతో కప్పండి. గాయానికి అంటుకోకుండా వదులుగా కట్టు కట్టండి.
గాయానకి కట్టు కట్టండి
గాయపడిన ప్రాంతాన్ని క్రిమినాశక క్లెన్సర్ ఉపయోగించి శుభ్రంగా చెయ్యండి. వైద్యులు సూచించిన ఆయింట్‌మెంట్‌లను ఉపయోగించవచ్చు.
శుభ్రంగా ఉంచండి
గాయంలో చీము లేదా వాపు ఇన్ఫెక్షన్ కు సంకేతాలు. ఇలా ఉంటే మాత్రం మీరు ఆలస్యం చేయకుండా వైద్యుడిని చూడాలి.
సంక్రమణ ప్రమాదం
పటాకుల పొగ వల్ల మీ కళ్ళు చికాకుగా ఉంటే, మీరు వాటిని శుభ్రమైన నీటితో కడుక్కోవలి. మీ కళ్ళను రుద్దకండి.
కళ్ళ రక్షణ
పటాకులు పేల్చేటప్పుడు కాటన్ (లేదా) డెనిమ్ దుస్తులు ధరించండి. ఒక బకెట్ నీళ్ళు సిద్ధంగా ఉంచుకోండి. మీ దుస్తులకు మంటలు అంటుకుంటే, పడుకుని నేలపై దొర్లండి.
భద్రత ముఖ్యం
గాయం పెద్దగా ఉంటే, ముఖం లేదా కంటి ప్రాంతం ప్రభావితమైతే, నిరంతర నొప్పి, ఇన్ఫెక్షన్ సంకేతాలు ఉంటే, వెంటనే వైద్య సహాయం తీసుకోండి.
వైద్యుడిని సంప్రదించాలి
మరిన్ని వెబ్ స్టోరీస్
బొటనవేలికి సిల్వర్ రింగ్.. సమస్యలు పోయి.. లైఫ్ అంత స్వింగ్..
మీ జీన్స్ కొత్తగా కనిపించాలంటే.. ఉతికినప్పుడు ఈ తప్పులు చెయ్యొద్దు..
రోజుకో ఉసిరి తింటే.. ఆ సమస్యలకు గోరి కట్టినట్టే..