వాస్తు టిప్స్ : మీ ఇంట్లో వెదురు ఏ దిశలో ఉంటే మంచిదో తెలుసా?

10 october 2025

Samatha

లక్కీ వెదురు మొక్క గురించి అందరికీ తెలిసిందే. చాలా  మంది దీనిని ఇంటి లోపల, ఆఫీసుల్లో అలంకరణ కోసం పెట్టుకుంటారు. కానీ దీని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయంట.

వాస్తు శాస్త్రంలో లక్కీ వెదురు మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. హిందూ గ్రంథాల ప్రకారం, ఈ మొక్కలో శ్రీ కృష్ణుడు నివసిస్తారని చెబుతుంటారు పండితులు.

అయితే ఇంట్లో సరైన దిశలో లక్కీ వెదురు పెట్టుకోవడం వలన అదృష్టం కలిసి రావడమే కాకుండా, సంపద కూడా పెరుగుతుందని చెబుతుంటారు .

మరి ఇంటులోపల లక్కీ వెదురు మొక్క పెట్టుకోవడానికి సరైన దిశ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఇంట్లో ఉంటే ఆనందం, శ్రేయస్సు కలుగుతుందంట.

లక్కీ వెదురు మొక్కను ఇంట్లో తూర్పు దిశలో పెట్టుకోవడం చాలా మంచిదంట. ఈ దిశలో దీనిని పెట్టడం వలన ఆర్థికం, ఆరోగ్య పరంగా కలిసి వస్తుందంట.

తూర్పు దిశలో ఈ మొక్కను నాటడం వలన వారి సమస్యల నుంచి బయటపడతారంట, ఎవరైతే అప్పుల ఊబిలో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారో వారికి అప్పుల సమస్యలు తీరిపోతాయి.

కోల్పోయిన సంపాదన మళ్లీ తిరిగి వస్తుంది. ఇంట్లో సానుకూల వాతావరణం పెరుగుతుంది. అయితే ఈ వెదురు మొక్కను ఎట్టి పరిస్థితుల్లో కిటికీ దగ్గర మాత్రం పెట్టకూడదంట.

దీనిని కిటికీ వద్ద పెట్టడం శుభకరం.  కిటికీ వద్ద ఈ మొక్కను పెంచడం వలన ఇంటిలోకి ప్రతి కూల శక్తి ప్రవేశించడమే కాకుండా జీవితంలో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయట.