ఇంట్లో తులసి ఆకుల నీళ్లు చల్లితే ఏమవుతుందో తెలుసా.. 

01 June 2025

Pic credit: Google

TV9 Telugu

హిందూ మతంలో ఇంట్లో తులసి ఆకుల నీటిని చల్లుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీని వెనుక అనేక మతపరమైన కారణాలు ఉన్నాయి.

తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తారు. తులసి నీటిని చల్లడం వల్ల ఇల్లు , చుట్టుపక్కల వాతావరణం శుద్ధి అవుతుంది. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.

తులసి ఆకులు నీరు చల్లడం వల్ల గాలిలో ఉండే దుర్వాసన పోతుంది.  గాలి శుభ్రంగా ఉంటుంది. ఇది ఇంటికి మంచి సువాసనను కూడా ఇస్తుంది.

తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు.  కనుక తులసి నీటిని చల్లడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు,  సంపద వస్తాయి.

తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. హిందువుల నమ్మకం ప్రకారం ఇంట్లో తులసి నీటిని చల్లడం వల్ల విష్ణువు తన ప్రత్యేక ఆశీర్వాదాలని ఇస్తాడని నమ్మకం.

వాస్తు శాస్త్రం కూడా తులసి మొక్క .. దాని నీటి ప్రాముఖ్యతను వివరిస్తుంది. తులసి నీటిని చల్లడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.

నీటిలో తులసి ఆకులను కలపడం వల్ల నీరు స్వచ్ఛంగా మారుతుంది. దీనిని చరణామృతం లాంటిదిగా భావిస్తారు. ఇంట్లో దీన్ని చల్లడం వల్ల సానుకూల, ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది.