02 August 2025
Pic Credit: freepik.com
TV9 Telugu
తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది లడ్డు. భక్తులు భక్తిశ్రద్ధలతో అత్యంత ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే అగ్ర స్థానం.
నేటితో తిరుపతి లడ్డుకు 310 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆగస్ట్ 2, 1715 లో తొలిసారి తిరుపతి లడ్డు ప్రవేశపెట్టారు.
ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, దేశీ నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడీపప్పు, కర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు.
ఈ లడ్డూలు నాలుగు రకాలుగా భక్తులకు అందిస్తున్నారు. ఆస్థానం లడ్డూ, కళ్యానోత్సవ లడ్డు, ప్రోక్తం లడ్డులు, చిన్న లడ్డులుగా భక్తులకు అందజేస్తున్నారు.
ఆస్థానం లడ్డూను ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే అందజేస్తారు. దీని బరువు గ్రా.750. ఈ లడ్డుని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంత మామిడి పప్పు, కుంకుమపువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు.
కళ్యాణోత్సవ లడ్డుని కల్యాణోత్సవం, ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులను అందజేస్తారు. ఈ లడ్డులను గత కొంత కాలంగా భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. కౌంటర్ లో కల్యాణోత్సవ లడ్డులు లభిస్తున్నాయి.
ప్రోక్తం లడ్డులను సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. శ్రీవారి ఆలయం వెనుక భాగాన ఉన్న ప్రసాదం కౌంటర్లలో వీటిని విక్రయిస్తారు ఈ లడ్డులు అందరికీ తెలిసినవే
చిన్న లేదా ఉచిత లడ్డులు.. వీటి బరువు 25 గ్రాములు ఉంటుంది. దర్శనం తర్వాత భక్తులకు ఉచితంగా అందిస్తారు.
2009లో తిరుపతి లడ్డుకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు లభించింది. కనుక తిరుపతి లడ్డు తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు.