అరటి చెట్టు పూజకు గురువారమే ఎందుకు? అసలు రహస్యం ఇదే!
Prasanna Yadla
08 october 2026
Pic credit - Pinterest
హిందూ సంప్రదాయంలో మొక్కలను, చెట్లను దేవతలుగా పూజించే ఆచారం ఉంది. అది నేటికీ కొనసాగుతుంది
చెట్లను దేవతలుగా పూజించే ఆచారం
అయితే, మనం చెప్పుకోవాల్సిన వాటిలో అరటి మొక్క కూడా ఒకటి ఇది అత్యంత పవిత్రమైనదిగా చెప్పాలి
అరటి చెట్టు
అయితే, కొందరు ప్రతి గురువారం అరటి చెట్టును పూజిస్తారు. గురువారమే ఎందుకు? అసలు రహస్యం ఏంటంటే?
గురువారమే ఎందుకు?
అరటి చెట్టు శ్రీమాన్ నారాయణ స్వామి, గురు బృహస్పతిల నివాసం. అరటి చెట్టులో ఉండే అన్ని భాగాలు పవిత్రతకు చిహ్నంగా చెబుతారు
పవిత్రతకు చిహ్నంగా చెబుతారు
గురువారం బృహస్పతి, విష్ణువుల ఆరాధనకు అంకితం చేసిన రోజు కాబట్టి, ఆ రోజున అరటి చెట్టుకు నీరు పోసి, దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందని విశ్వాసం.
దీపం వెలిగిస్తే మంచిది
గురువారం తెల్లవారు జామున నిద్రలేచి, స్నానం చేసి, పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు
పసుపు రంగు దుస్తులు
పూజ చేసిన తర్వాత అరటి చెట్టుకు నీరు పోసి, కొంచం పసుపు, పసుపు పువ్వులు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి.
నైవేద్యం సమర్పించాలి
ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు