చంద్ర గ్రహణం రోజున సూతక కాలం ఇదే.. ఈ సమయంలో జాగ్రత్త..
04 September 2025
Prudvi Battula
క్షీర సాగర మధనం నుంచి ఉద్బవించిన అమృతాన్ని దేవదానవులకు పంచుతున్నప్పుడు రాక్షసుడైన రాహువు అమృతాన్ని దొంగిలించడానికి ప్రయత్నించాడు.
రాహువును గుర్తించిన శ్రీమహా విష్ణువు అతని శిరస్సును ఖండిస్తాడు. అప్పటి నుంచి రాహువు సూర్య చంద్రులను మిగడానికి ప్రయత్నించడం వల్ల గ్రహణాలు ఏర్పడుతాయి.
సైన్స్ మాత్రం గ్రహణాలు అనేవి సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉంటూ సూర్యుని కాంతికి భూమిపై పడకుండా అడ్డుపడినప్పుడు ఏర్పడతాయని అంటుంది.
భూమి నీడ చంద్రుడిపై పడిన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడుకి భూమికి మధ్య సూర్యుడి వచ్చిన అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
ఈ ఏడాది భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ 7 ఆదివారం నాడు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది.
ఇది సెప్టెంబర్ 7న రాత్రి 9:58 గంటలకు నుంచి సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 గంటలకు వరుకు చంద్ర గ్రహణం ఏర్పడనుంది.
చంద్ర గ్రహణం ఏర్పడటానికి 9 గంటల ముందు అంటే సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12.57 గంటల నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది.
ఈ సూతక కాలంలో పూజలు లేకుండా ఆలయాల తలుపులు మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాలతో తిరిగి ఆలయాలు తెరచి పూజలు చేస్తారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
సెప్టెంబర్ నెలలో ఈ రాశులవారికి మహర్దశ.. పట్టిందల్లా బంగారమే..
మీ బ్లడ్ గ్రూపే మీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది.. ఎలా అంటారా.?
గ్రీన్ యాపిల్ మీ డైట్లో ఉంటే.. ఆ సమస్యలకు బెర్త్ ఫిక్స్ అయినట్టే..