అంత్యక్రియల తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదంటారు?ఎందుకో తెలుసా?

14  September 2025

Samatha

ఒక వ్యక్తి మరణించినప్పటి నుంచి దహన సంస్కారాలు , దిన కర్మలు పూర్తి అయ్యే వరకు ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి.

అయితే  అంత్యక్రియల తర్వాత అస్సలే వెనక్కి తిరిగి చూడకూడదని చెబుతుంటారు నిపుణులు. మరి ఎందుకు దహన సంస్కారాల తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు?

కాలుతున్న చితిని  వెనక్కి తిరిగి చూస్తే ఏం జరుగుతుంది? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు అనే విషయాల్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

అంత్యక్రియల గురించి , వ్యక్తి మరణానంతర జీవితం గురించి గరుడ పురాణంలో ఎన్నో విషయాలు తెలియజేయడం జరిగింది.

అయితే దహన సంస్కారాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా తెల్లటి దుస్తులే ధరించాలంట. దీని వలన సానుకూల శక్తి ప్రకాశించడమే కాకుండా ఆత్మకు కూడా శాంత   కలుగుతుందంట.

అయితే అంతమ సంస్కారాల అనంతరం అస్సలే ఏ వ్యక్తి కూడా వెనక్కి తిరిగి చూడకూదంటారు. అలా చూడటం వలన చూసిన వ్యక్తితో ఆత్మ ప్రేమలో పడుతుందంట.

దీని వలన అతను ఒక్కరే తన మరణం గురించి దిగులు చెందుతున్నాడని భావించి, ఆ ఆత్మ శాంతిని పొందదంట, ఆ వ్యక్తితో బంధం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుందట.

అంతే కాకుండా ఆత్మ పైకి వెళ్లకుండా, ఇంటికి తిరిగి వెళ్లాలని కోరుకుంటుందంట. అందుకే, అస్సలే వెనక్కి తిరిగి చూడకూదంట.