ఈ హిందూ ఆలయలు ప్రపంచంలోనే ధనిక ఆధ్యాత్మిక స్థలాలు..

16 April 2025

Prudvi Battula 

కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం అత్యంత ధనికమైనది. దానిలో 1 లక్ష కోట్లకు పైనే విలువైన నిధి ఉంది.

తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవాలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న యాత్రా స్థలం. ఏటా లక్షలాది భక్తులు తమ కానుకలతో ఆలయ సంపదకు దోహద పడుతున్నారు.

జమ్మూ కాశ్మీర్‌లోని త్రికూట కొండలలో ఉన్న వైష్ణో దేవి ఆలయం అత్యంత ధనిక, అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి.

మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా దర్శనానికి అన్ని వర్గాల భక్తులు షిర్డీకి తరలివస్తారు. భక్తులు సమర్పించే విరాళాలతో ఆలయ అపారమైన సంపద వస్తుంది.

ఒడిశాలోని పూరిలో జగన్నాథుని ఆలయం ధనిక ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం రహస్య బండాగారంలో కోట్లు విలువ చేసే నిధి ఉంది.

తమిళనాడులోని మదురై మీనాక్షి ఆలయం ద్రావిడ నిర్మాణ అద్భుతం. ఇది మీనాక్షి మరియు సుందరేశ్వరర్ అంకితం చేయబడింది.

కేరళలో ఉన్న గురువాయూర్ ఆలయం 5000 సంవత్సరాల పురాతనమైనదిగా భావించబడే కృష్ణుడి విగ్రహానికి ప్రసిద్ధి చెందింది.

12 జ్యోతిర్లింగాలలో ఒకటి గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం. చరిత్రలో అనేక సార్లు ధ్వంసం చేయబడి పునర్నిర్మించబడిన ఆలయం.