మంగళవారం నాడు అస్సలే ఈ పొరపాట్లు చేయకూడదు..చేశారో ఇక అంతే సంగతి!

samatha 

18 February 2025

Credit: Instagram

మంగళవారం చాలా పవిత్రమైనది. ఈరోజు హనుమంతుడిని పూజించడం వలన మంచిజరగడమే కాకుండా,  జాతకంలో కుజుడి స్థానం బలపడుతుంది.

రామ భక్తుడు హనుమంతుడు మంగళవారం జన్మిచాడని, ఈయనకు అంగారక గ్రహంతో సంబంధం ఉండటం వలన ఈ రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదంటున్నారు పండితులు.

ఈ రోజు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని పనులు  చేయడం వలన  జీవితంలో దురృష్టాన్ని కొని తెచ్చుకోవడమేనంట.కాగా, మంగళవారం చేయకూడని పనులు ఏవో చూద్దాం.

ఈ రోజున శరీరం,మనస్సులో స్వచ్ఛంగా ఉండటం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి, మంగళవారం నాడు పొరపాటున కూడా మాంసం, మద్యం మొదలైన వాటిని తినకుండా ఉండాలి.

మంగళవారం నాడు పొరపాటున కూడా వాయువ్యం, పడమర లేదా ఉత్తరం వైపు ప్రయాణించకూడదు. ఈ దిశలో ప్రయాణించడం అశుభ శకునంగా పరిగణించబడుతుంది. 

మంగళవారం నాడు పొరపాటున కూడా నల్లటి దుస్తులు, ఇనుము, గాజు, సౌందర్య సాధనాలను కొనకూడదు, అలా చేయడం అశుభకరమని భావిస్తారు. ఈ వస్తువులను కొనడం వల్ల కుటుంబం, కెరీర్,ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందంట

జ్యోతిషశాస్త్రంలో, మంగళవారం నాడు గోర్లు, జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం కత్తిరించుకోవడం అశుభమని భావిస్తారు .అలా చేయడం వల్ల ఆయుష్షు ఎనిమిది నెలలు తగ్గుతుందని చెబుతారు.

మంగళవారం నాడు పొరపాటున కూడా ఎవరితోనూ డబ్బు లావాదేవీలు చేయకూడదు. అలాగే, కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. మంగళవారం నాడు లావాదేవీలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు, నష్టాలు పెరిగే అవకాశాలు పెరుగుతాయి