శివరాత్రి స్పెషల్ : ఏపీ, తెలంగాణలో ప్రసిద్ధ శివాలయాలు ఇవే!
samatha
25 February 2025
Credit: Instagram
రాజన్న సిరిసిల్లా జిల్లాలో వేములవాడ దేవస్థానంలో పరమ శివుడు రాజరాజేశ్వరుడిగా కొలువై ఉన్నారు. ఇక్కడ ధర్మ గుండంలో స్నానం చేయడం వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయంట.
ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావు పేటకు 15 కిలోమీటర్ల దూరంలో కోటప్పకొండలో పరమశివుడు కొలువై ఉన్నాడు. ఇక్కడి శివయ్యను త్రికుటాచలేశ్వరుడు, త్రికోటేశ్వరునిగా కొలుస్తారు.
హైదరాబాద్‌కు చాలా దగ్గరలో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఆ శ్రీరాముడే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించారని అక్కడి వారు చెబుతుంటారు.
నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఆలయాల్లో ఛాయ సోమేశ్వర ఆలయం ఒకటి. ఈ గుడిలోని శివ లింగం ప్రతి రోజూ శావ్వతమైన నీడను కలిగిఉంటుందంట.
ములుగు జిల్లాలో రామప్ప దేవాలయం ఉంది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయం, ఎనిమిదో శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు. ప్రసిద్ధ ఆలయాల్లో ఇదొకటి.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం దేవస్థానం ఒకటి. ఇది నంద్యాల జిల్లాలో ఉంది. నల్లమల కొండలలో ఉన్న ఈ శివాలయాన్ని సందర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయంటారు పండితులు.
తెలుగు రాష్ట్రల్లోని యాగంటి ఉమా మహేశ్వర ఆలయం ఒకటి. ఇక పార్వతీ పరమేశ్వరులు అర్ధనాదీశ్వర రూపంలో దర్శనం ఇస్తారు. అంతే కాకుండా ఇక్కడ శివుడు లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో దర్శనం ఇస్తాడు.
సప్తనదుల మధ్య కొలువై ఉన్న శివాలయం. సంగమేశ్వర ఆలయం. ఇక్కడ పరమ శివుడు వేసవి కాలంలో మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తాడు, మిగితా రోజులు క్రిష్ణమ్మ ఒడిలోనే ఉంటాడంట.