పూరీ జగన్నాథ దేవాలయం రహస్యాలు.. సైన్స్‎కి సవాల్..

20 June 2025

Prudvi Battula 

పూరీ జగన్నాథ దేవాలయంపైన ఉన్న జెండా అన్నింటిలా కాకండా గాలికి వ్యతిరేక దశలో ఎగురుతుంది. దీనికి సైన్స్ ఇప్పటికి సమాధానం కనుగొనలేకపోయింది.

ఆలయం పైభాగంలో ఒక టన్ను బరువున్న చక్రం ఉంది. పూరీలోని ఏ ప్రదేశంలోనైనా చక్రం తన వైపుకు తిరిగి ఉన్నట్లు కనిపిస్తుంది.

అలాగే ఈ గుడిపై భాగంలో జెండాను పూజారి రోజు ప్రతిరోజూ 65 మీటర్ల ఎత్తులోని జెండా మార్చడం జరుగుతుంది లేనిచో ఎదో కారణంగా గుడి 18 ఏళ్ల మూతపడుతుంది.

పూరీ జగన్నాథ ఆలయ గోపురం పైన ఒక్క పక్షి కూడా కనిపించదు. విమానాలు ఏ పక్షి కూడా ఎగర లేదు. దీనికి ఇంకా స్పష్టత లేదు.

పూరీలో ప్రతి 8, 12, లేదా 19 ఏళ్లకు ఒకసారి నబకలేబారా ఉత్సవం ఉంటుంది. ఆ వేడుకలో పాత విగ్రహాలు స్థానంలో కొత్తవి ప్రతిష్టిస్తారు. వీటిని ప్రత్యేకమైన చెక్కతో తయారు చేస్తారు.

రోజులో ఒక్కసారి కూడా ఈ ఆలయానికి నీడ నేలపై పడదు. అది దేవుని మహిమా లేదా కేవలం నిర్మాణ అద్భుతమా ఇప్పటికీ తెలియదు.

ఈ ఆలయం సముద్రానికి దగ్గరలోనే ఉన్నప్పటికీ లోపల అడుగుపెట్టిన వెంటనే అలల శబ్దం వినిపించదు. బయట మాత్రమే వినిపిస్తుంది.

సాధారణంగా తీరప్రాంతాలలో పగటిపూట సముద్రం నుండి భూమి వైపు గాలి వీస్తుంది. సాయంత్రం వేళల్లో భూమి నుండి సముద్రం వైపు వీస్తుంది. కానీ పూరీలో ఇది దీనికి విరుద్ధంగా జరుగుతుంది.