దీపావళి కదా అని స్వీట్స్ ఎక్కువగా తేనేస్తారేమో.. జర భద్రం..
12 October 2025
Prudvi Battula
దీపావళి అంటేనే ఫ్యామిలీ గెట్ టు గెదర్‌లు, పార్టీల హడావిడి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు కూడా సంతోషంగా జరుపుకొనే పండగ.
దీపావళి పండగ వేళా స్వీట్స్, దేశీ స్నాక్స్ వంటి వంటకాలతో దేశవ్యాప్తంగా ప్రతి ఇల్లు ఘుమఘుమలడుతుంది.
పండగ పూట పిల్లల నుంచి పెద్దల వరకు స్వీట్స్ ఎక్కువగా తేనేస్తుంటారు. అయితే అధిక క్యాలరీలు, కొవ్వు పదార్ధాలు విషయంలో జాగ్రత్త వహించాలి.
కొవ్వు పదార్థాలు, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉంటూ వాటికి బదులుగా ఆరోగ్యకర ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి.
మీ వంటకాల విషయంలో జాగ్రత్తగా వహించకుంటే హై క్యాలరీ ఆహరంతో పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. కొద్దిపాటి జాగ్రత్తలతో దిపావళి స్వీట్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
ఖీర్, షిర్‌ఖండ్ వంటి పాలతో చేసిన డెజెర్ట్స్ చేసుకోండి. చక్కర స్ధానంలో డేట్స్, కిస్‌మిస్, తాజా పండ్లతో పాటు కొద్దిమోతాదులో బెల్లం, తేనెను వాడితే బెటర్.
రవ్వ లడ్డు, కొబ్బరి లడ్డుకు బదులు ప్రొటీన్ అధికంగా ఉండే శనగపిండితో చేసిన లడ్డూ, వేరుశనగ లడ్డూ, మైసూర్ పాక్‌ను తయారు చేసుకోవచ్చు.
బయట స్వీట్ షాప్స్‌లో స్వీట్స్‌ను కొనుగోలు చేయకుండా ఇంట్లోనే తయారు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.