సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం.. ఆ రాశులవారిపై ఎఫెక్ట్.. జర భద్రం..
03 September 2025
Prudvi Battula
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహణాలను అశుభకరమైనవిగా భావిస్తారు. ఈ నెలలో సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడబోతున్నాయి.
సెప్టెంబర్ 21వ తేదీన ఆదివారం అంటే భాద్రపద అమావాస్య రోజున రాత్రి 11 గంటల నుంచి సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3.23 గంటల వరకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
ఈసారి ఏర్పడేది పాక్షిక సూర్యగ్రహణం. ఇది అంటార్కిటికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో కనిపిస్తుంది.
హిందూ పంచాంగం ప్రకారం ఈ సూర్యగ్రహణం కన్యారాశిలో ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.
మిధున రాశి వారు సూర్యగ్రహణం సమయంలో ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా బలహీనంగా ఉంటారు. కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది.
కన్యారాశి జాతకులు సూర్యగ్రహణం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికపరమైన. ఆరోగ్యపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి.
ధనుస్సు రాశి జాతకులకు సూర్యగ్రహణం కారణంగా కుటుంబ సమస్యలు, చేసే పనులలో నిరాశ ఎదురవుతుంది. ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మీనరాశివరికి సూర్యగ్రహణం కారణంగా ఆర్థికపరంగా సమస్యలు పెరుగుతాయి. కేసుల్లో చిక్కుకుంటారు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం.
మరిన్ని వెబ్ స్టోరీస్
సెప్టెంబర్ నెలలో ఈ రాశులవారికి మహర్దశ.. పట్టిందల్లా బంగారమే..
మీ బ్లడ్ గ్రూపే మీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది.. ఎలా అంటారా.?
గ్రీన్ యాపిల్ మీ డైట్లో ఉంటే.. ఆ సమస్యలకు బెర్త్ ఫిక్స్ అయినట్టే..