నాగపంచమి : పుట్టలో పాలుపోయడానికి సరైన సమయం ఏదో తెలుసా?

Samatha

26 july  2025

Credit: Instagram

శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నాగ పంచమి ఒకటి. ఈ పండుగను హిందువులందరూ ఘనంగా జరుపుకుంటారు.

నాగుల పంచమిని శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పక్ష పంచమి తిథి రోజున జరుపుకుంటారు. ఈ సారి నాగ పంచమి జూలై 29న వస్తుంది.

ఈరోజు భక్తులందరూ నాగ దేవతను పూజిస్తారు. ఉదయాన్నే నిద్రలేచి, ఇంటిని శుభ్రం చేసుకొని, కొత్త బట్టలు ధరించి, నాగమ్మను పూజించుకుంటారు.

అంతే కాకుండా ఉపావాసం ఉంటూ, పుట్టలో నాగు పాముకు పాలు పోసి తమను తమ కుటుంబాన్ని రక్షించమని కోరుకుంటారు.

అయితే పుట్టలో పాలు పోసే సమయంలో కూడా తప్పకుండా తిథితి చూడాలని చెబుతారు పండితులు.ఎందుకంటే సమయం దాటిన తర్వాత పాలు పోసినా అంత ప్రయోజనం ఉండదు.

ఇక ఈ సారి జూలై 29 మంగళ వారం రోజున నాగ పంచమి వస్తుంది కాబట్టి, ఈ రోజు పుట్టలో పాలు పొయ్యడానికి సరైన సమయం ఏదో తెలుసుకుందాం.

నాగ పంచమి జూలై 29వ తేదీ మంగళవారం జరుపుకోనున్నారు. అయిదే ఈ రోజు ఉదయం  5:41 నుంచి ఉదయం 8:23 వరకు మంచి సమయం అంట.

ఈ సమయంలోనే భక్తులందరూ పుట్టలో పాలు పోయాలని చెబుతున్నారు పండితులు. దీని వలన సర్పదోషాల నుంచి విముక్తి లభిస్తుందంట.