మనీ ప్లాంట్ లేని ఇల్లే లేదు . ప్రతి ఒక్కరి ఇంటిలో మనీ ప్లాంట్ అనేది తప్పనిసరి అయిపోయింది.
అయితే చాలా మంది దీనిని ఇంటి అలంకరణ కోసం ఇంటిలో నాటుకుంటే కొంత మంది మాత్రం ఆర్థికంగా కలిసి రావాలి అని ఇంటిలో నాటుకుంటారు.
ఇక వాస్తు ప్రకారం ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క ఎంత వేపుగా పెరిగే అంగా అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు.
కానీ కొన్ని సార్లు పెట్టిన చాలా తక్కువ సమయంలోనే మనీ ప్లాంట్ మొక్క ఎండిపోతుంది. దీంతో ఇది చాలా అశుభం అని భయపడి పోతుంటారు.
కాగా, ఇప్పుడు మనం మనీ ప్లాంట్ మొక్క ఎండిపోవడం అశుభమా? దీని గురించి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో చూసేద్దాం.
అయితే మనీ ప్లాంట్ మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అంతే కాకుండా దీనిని ఇంటికి సంపద తెచ్చేదానిగా పరగణిస్తుంటారు.
అందుకే చాలా వరకు మనీ ప్లాంట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అనుకోకుండా మనీ ప్లాంట్ మొక్క వాడిపోతే బాధపడుతుంటారు.
కానీ మనీ ప్లాంట్ మొక్క ఎండిపోతే బాధపడాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు నిపుణులు. డబ్బుకు దానికి సంబంధం లేదు సరైన జాగ్రత్తలు లేకపోవడం వలన అది ఎండి పోయిందంట.