ఆ రెండు రాశుల వారిపై చంద్ర గ్రహణం ప్రభావం.. బీ కేర్ఫుల్..
02 September 2025
Prudvi Battula
ఈ ఏడాది సెప్టెంబర్ 7 న చంద్రగ్రహణం ఏర్పడుతుంది. రాత్రి 9:58కి మొదలై, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది. 11:42కి సంపూర్ణ గ్రహణం ఏర్పడనుంది.
ఈసారి కర్కాటక, కుంభ రాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున వారిపై ప్రభావం పడనుంది. జాగ్రత్తగా ఉండాలి.
ఈ రెండు రాశుల వ్యక్తులు చంద్రగ్రహణాన్ని చూసే ప్రయత్నం చేయకుండా కొన్ని నియమాలు పాటిస్తే ప్రభావం తగ్గవచ్చు.
కర్కాటక రాశివారు చంద్ర గ్రహణం సమయంలో వీరికి కొన్ని అనుకోని అవాంఛనీయ ఘటనలు కారణంగా మనసులో ఆందోళన కలుగుతుంది.
ఈ రాశివారికి ఈ సమయం ఇంట్లో ఏ కారణం లేకుండా గొడవలు రావచ్చు. వ్యక్తిగత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.
కర్కాటక రాశివారు గ్రహణం సమయంలో శివుడిని ధ్యానం చేస్తూ ఉండాలి. చంద్రుని ఆశీస్సులు పొందడానికి శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి.
కుంభ రాశివారు చంద్రగ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడు కుంభరాశిలో సంచరించే సమయంలో చంద్రగ్రహణం ఏర్పడనుంది.
రాహువు కూడా కుంభ రాశిలో ఉన్నందున చంద్రుడు, రాహువు కలయిక కుంభ రాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మానసిక ఒత్తిడి సమస్య ఉంటుంది.
గ్రహణ సమయంలో ఈ రాశివారికి ఎవరితోనైనా వివాదం రావచ్చు. దీని కారణంగా మనస్సు గందరగోళంగా ఉంటుందని పండితులు అంటున్నారు.
కుంభ రాశివారు చంద్రగ్రహ దోష పరిహారం కోసం, రాహువు చెడు దృష్టి నుంచి రక్షించుకోవడానికి మహామృత్యుంజయ మంత్రాన్ని జపం చేయాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
సెప్టెంబర్ నెలలో ఈ రాశులవారికి మహర్దశ.. పట్టిందల్లా బంగారమే..
మీ బ్లడ్ గ్రూపే మీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది.. ఎలా అంటారా.?
గ్రీన్ యాపిల్ మీ డైట్లో ఉంటే.. ఆ సమస్యలకు బెర్త్ ఫిక్స్ అయినట్టే..