కృష్ణాష్టమి.. ఒక్క నెమలి ఈక మీ అదృష్టాన్నే మార్చేస్తోంది!
samatha
02 september 2026
Pic credit - Pinterest
శ్రీకృష్ణుడికి నెమలి ఈక ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ ఆయన కిరిటంపై ఇవి ఉంటాయి.
అయితే ఈ కృష్ణాష్టమి రోజు ఇంటికి నెమలి ఈక తీసుకొని రావడం చాలా శుభప్రదమంట. కాగా, దాని గురించి తెలుసుకుందాం.
2026 సెప్టెంబర్ 4 శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ పండుగను భక్తులందరూ చాలా ఇష్టంగా జరుపుకుంటారు. ప్రతి గ్రామంలో వేడుకలు నిర్వహించుకుంటారు.
అయితే కృష్ణుడి పూజలో మిఠాయిలు మాత్రమే కాకుండా, నెమలి ఈకలు కూడా చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అటువంటి రోజు నెమలి ఈక ఇంటిలోకి తీసుకురావడం చాలా శుభ ప్రదం.
అంతే కాకుండా జన్మాష్టమి అర్ధరాత్రి నెమలి ఈకతో శ్రీ కృష్ణుడి పాదాలు తాకి, దానిని ఇంటిలో పెట్టుకోవడం వలన ఇంటిలోపల సానుకూలత పెరుగుతుందంట.
జన్మాష్టమి రోజు పూజలు పూర్తి చేసిన తర్వాత నెమలి ఈకలను స్వామి వారి పాదాల వద్ద పెట్టి , తర్వాత ఇంటిలో అతికించుకోవాలంట.
తప్పకుండా పూజలో నెమలి ఈకలు ఉండేలా చూసుకోవాలంట. దీని వలన శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.