భార్యకు భర్త మల్లెపూలు కొనిపెడితే ఏం జరుగుతదో తెలుసా? అదృష్టమే అదృష్టం!

Samatha

06 April 2026

భార్య భర్తల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ బంధం ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా సాగిపోవాలని చాలా మంది అనుకుంటారు.

భార్య భర్తల అనుబంధం

ఇంకొంత మంది తమ భర్తకు అదృష్టం కలిసి రావాలి అనుకుంటారు. అయితే భర్తకు అదృష్టం కలిసిరావాలి అంటే తప్పకుండా భార్యకు మల్లెపూలు కొనిపెట్టాలని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

అదృష్టం కలిసి రావాలని

జాతక చక్రంలో భార్యకు కారకుడు శుక్రుడు. అంతే కాకుండా శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించినది. అయితే లక్ష్మీదేవికి తెల్లని పూలు, సువాసనిచ్చే పూలు చాలా ఇష్టమంట.

శుక్ర గ్రహం

అందుకే ఎవరు అయితే తన భార్యకు ప్రతి రోజూ మల్లెపూలు కొనిస్తారో వారికి శుక్రుడి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగడమే కాకుండా, అదృష్టం కలిసి వస్తుందంట.

అదృష్టం

భార్యకు మల్లెపూలు కొని ఇవ్వడం వలన భర్త సంపాదన పెరుగుతుందంట. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలు తగ్గిపోయి, ఆదాయం రెట్టింపు అవుతుంది.

సంపాదన

అంతే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏ భర్త అయితే భార్యకు మల్లెపూలు కొనిస్తాడో, వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందంట.

మానసిక ప్రశాంతత

అలాగే భార్యకు మల్లెపూలు కొనివ్వడం వలన భర్త ఆయుషు కూడా పెరుగుతుందంట. వైవాహిక జీవితం చాలా ఆనందంగా గొడవలు లేకుండా సాగుతుంది.

ఆనందమైన జీవితం

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

ముఖ్యగమనిక