బుధవారం వినాయక చవితి.. ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే అదృష్టం మీదే!

Samatha

27 August  2025

Credit: Instagram

ఈ సంవత్సరం ఆగస్టు 27న బుధ వారం రోజున వినాయక చవితి పండుగ వచ్చింది. నేడు అంగ రంగ వైభవంగా గణేశుడి ఉత్సవాలను ప్రారంభించనున్నారు.

ఉదయాన్నే నిద్రలేచి, ఇంటిని శుభ్ర పరిచి, వినాయకుడికి పూజలు చేయడానికి ప్రతి ఒక్కరూ రెడీ అవుతుంటారు.

అయితే ఈ సంవత్సరం గణేష్ చతుర్థి బుధవారం రావడం వలన ఈ రంగు దుస్తులను ధరించి పూజ చేయడం వలన మంచి జరుగుతుందంట.

కాగా, ఇప్పుడు మనం వినాయకుడికి పూజ చేసే క్రమంలో ఏ రంగు దుస్తులు ధరించడం మంచిది? ఏది కలిసి వస్తుందో చూద్దాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధ వారం, బుధ గ్రహానికి సంబంధించినది, కాబట్టి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం మంచిదంట.

అదే విధంగా,  ఎరుపు రంగు లక్ష్మీ దేవి, వినాయకుడికి చాలా ఇష్టమైన రంగు. ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం చాలా శుభప్రదం.

అలాగే వినాయక చవితి రోజూ, శుభానికి, జ్ఞానానికి, శ్రేయస్సుకు చిహ్నమైన పసుపు రంగు దుస్తులు ధరించడం కూడా చాలా మంచిదంట.

కానీ ఈ వినాయక చవితి రోజున ఎట్టిపరిస్థితుల్లో నలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది కాదంట, ఇది దు:ఖానికి చిహ్నం, అశుభం.