సూర్యాస్తమయంలో ఈ పనులు చేస్తే అశుభం.. వెంటనే మానుకోండి.. 

14 June 2025

Prudvi Battula 

హిందూ విశ్వాసం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం, ఆరబెట్టడం వల్ల వ్యక్తి దుఃఖం, దురదృష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

సూర్యాస్తమయం సమయంలో ఎవరూ ఎప్పుడూ నిద్రపోకూడదు. అటువంటి వ్యక్తులున్న ఇంట్లో వ్యాధి, దుఃఖం,పేదరికం ఇంట్లోనే ఉంటాయి.

వ్యాధుల బారిన పడిన వారు, చిన్న పిల్లలు మినహా మిగిలిన వ్యక్తులు సూర్యాస్తమ సమయంలో నిద్రపోవడం దారిద్య్రానికి కారణం.

హిందూ విశ్వాసం ప్రకారం సూర్యాస్తమయం సమయంలో మీ ఇంటికి తిరిగి వస్తుంటే.. ఆ సమయంలో తప్పనిసరిగా ఏదైనా మీతో ఇంట్లోకి తీసుకుని రావాలి.

ఇంట్లో సంపదకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే.. సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా ఎవరైనా గోర్లు, జుట్టును కత్తిరించుకోకూడదు.

సూర్యాస్తమయం తర్వాత చెట్ల ఆకులు, కొమ్మలు మొదలైన వాటిని విరగొట్టడం, చెట్లను కాల్చడం, చెట్ల పువ్వులను కోయడం అతి పెద్ద తప్పుగా పరిగణిస్తారు.

హిందువుల విశ్వాసం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత చనిపోయిన వ్యక్తికి దహన క్రియలు చేయరు.. ఈ నియమాన్ని విస్మరిస్తే, చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి లభించదు.

సూర్యాస్తమయం సమయంలో ఇంటికి చీపురుతో శుభ్రపరచ కూడదు. ఇలా చేయడం వలన సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి ఆగ్రహానికి ఆ కుటుంబ సభ్యులు గురవుతారు.