ఇంట్లో బల్లులు ఉండటం మంచిదేనా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే?

02 September 2025

Samatha

ఇంట్లో బల్లులు ఉండటం అనేది కామన్. కొందరి ఇంట్లో ఎక్కువ బల్లులు ఉంటే, ఇంకొందరి ఇంట్లో అస్సలు బల్లులే ఉండవు.

కాగా, ఇప్పుడు మనం ఇంట్లో బల్లులు ఉండటం మంచిదేనా? కాదా? అనే విషయం తెలుసుకుందాం.

కొంత మంది ఇంట్లో బల్లులు ఉంటే చాలా వాటిని బయటకు పంపించేస్తుంటారు. ఇంకొందరేమో వాటిని చూస్తే మంచి జరుగుతుందని అవి ఇంట్లో ఉన్నా ఏమనరు.

అయితే  వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వెండి బల్లి విగ్రహం ఉండటం చాలా మంచిదంట. దీనిని చూడటం వలన అనుకున్న పనులు సమయానికి పూర్తి అవుతాయంట.

అలాగే, ఏ ఇంట్లో అయితే బల్లి ఉంటుందో, ఆ ఇంట్లో సంపద పెరగడమే కాకుండా ఆనందం, శ్రేయస్సు కలుగుతుందంట.

ముఖ్యంగా, , వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి పూజ గదిలో రిసెప్షన్ గదిలో బల్లులు కనిపించడం చాలా శుభ సూచకం అంటున్నారు పండితులు.

ఇంటి పూజ గదిలో లేదా హాల్ లో మీరు బల్లులను గనుక చూసినట్లైతే, అది ఫ్యూచర్‌లో మీరు అధికంగా డబ్బు సంపాదించడానికి సూచనంట.

అలాగే, దీపావళి రోజున గనుక మీరు మీ పూజ గదిలో బల్లిని చూసినట్లు అయితే, అది సంవత్సరం పొడవునా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని సూచన.