నాగ పంచమి రోజు నాగు పామును చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Samatha

22 july  2025

Credit: Instagram

నాగ పంచమి వచ్చేస్తుంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈసారి జూలై 29న ప్రతి ఒక్కరూ నాగుల పంచమిని జరుపుకుంటారు.

అయితే ఈ రోజున నాగ దేవతను ప్రత్యేకంగా, భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా, నాగ దేవతకు పాలు పోసి తమ భక్తిని చాటుకుంటారు.

అయితే ఈ రోజు కొందరికి కలలో పాములు కనిపించడం లేదా కొంత మంది ఇంటికి పాములు రావడం లేదా ఈ రోజు ఎక్కడైనా పాము కనిపిస్తుంటుంది.

అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నాగ పంచమి రోజున పామును చూడటం దేనికి సంకేతమో? ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం.

నాగ పంచమి రోజున పామును చూడటం చాలా మంచిదంట. ఇది నాగదేవత ఆశీర్వాదం అలాగే శివుడి అనుగ్రహం ఉన్నట్లు అంట.

అలాగే, నాగ పంచమి రోజున కలలో పామును చూడటం కూడా చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు.

మరీ ముఖ్యంగా ఈ రోజు శివలింగం చుట్టూ ఉన్న నాగుపాము లేదా నాగ, నాగిని జంట పాములను చూడటం చాలా శుభ ప్రదం అంట.

ఎందుకంటే పామును శివుని ఆభరణంగా భావిస్తారు కాబట్టి నాగ పంచమి రోజున పామును చూడటం వలన ఇది శివుడి అనుగ్రహం కలిగినట్లు అంట.