సూర్యగ్రహణ దోషం పోవాలంటే.. ఈ రాశులవారు వీటిని దానం చెయ్యాల్సిందే..

19 September 2025

Prudvi Battula 

మేష రాశివారు సూర్యగ్రహణ అశుభ ప్రభావాలను నివారించడానికి బెల్లం, ఎరుపు రంగు బట్టలు, పప్పుధాన్యాలు వంటి ఎరుపు రంగు వస్తువులను దానం చేయాలి.

వృషభ రాశివారు సూర్యగ్రహణ ప్రభావాన్ని తగ్గించుకోవాలనుకుంటే పెరుగు, పాలు, తెల్లని బట్టలు, చక్కెర మొదలైనవి దానం చేయండి.

మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు సూర్యగ్రహణం తర్వాత ఆవుకు పచ్చి గడ్డి పెట్టడం, పేదలకు పచ్చి పప్పులు, బట్టలు, పచ్చి కూరగాయలను దానం చేయడం మంచిది.

కర్కాటక రాశి వ్యక్తులు పాలు, పెరుగు, చక్కెర, తెల్లని బట్టలు, ముత్యాలు వంటి తెల్లని వస్తువులు దానం చేయడం శుభప్రదం.

సింహ రాశివారు సూర్యగ్రహణం రోజున బెల్లం, గోధుమలు, రాగి పాత్రలు, ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులతో దానం చేస్తే గ్రహణ ప్రభావం దూరం అవుతుంది.

కన్యా రాశి జాతకులు పేదలకు ఆకుపచ్చ పప్పులు, కాంస్య పాత్రలు ఆకుపచ్చ కూరగాయలు, ఆకుపచ్చ బట్టలు మొదలైనవి దానం చేస్తే గ్రహణ ప్రభావం తగ్గుతుంది.

తులారాశి వారు తెల్లని వస్తువులు అంటే పెరుగు, చక్కెర, పాలు ఇలాంటివి దానం చేస్తే సూర్యగ్రహణ ప్రభావం ఉండదు.

వృశ్చిక రాశి వ్యక్తులు సూర్యగ్రహణం తర్వాత పేదలకు పప్పులు, బెల్లం, ఎర్రటి బట్టలు, పండ్లు మొదలైనవి దానం చేయడం శుభప్రదం.

ధనుస్సు రాశిచక్రం వ్యక్తులు సూర్యగ్రహణం రోజున పసుపు రంగు వస్తువులను దానం చేయడం ప్రయోజనకరం అంటున్నారు పండితులు.

మకర రాశి జాతకులు సూర్యగ్రహణ సమయంలో ఆవ నూనె, నువ్వులు, ఇనుప పాత్రలను దానం చేయడం చాలా శుభప్రదమని చెబుతున్నారు జ్యోతిష్యులు.

కుంభ రాశి వారు పేదలకు ఆవ నూనె, నువ్వులు, ఇనుప ఉత్పత్తులు దానం చేయడం వల్ల సూర్యగ్రహణ ప్రభావం దూరం అవుతుంది.

మీన రాశి జాతకులు సూర్యగ్రహణం తర్వాత పసుపు పండ్లు, పసుపు బట్టలు, పప్పుధాన్యాలు మొదలైన వాటిని దానం చేస్తే గ్రహణం ప్రభావం నుంచి బయటపడవచ్చు.