కార్తీక మాసం తొలి సోమవారం ఇలా పూజ చేస్తే.. శివయ్య అనుగ్రహం.. 

Prudvi Battula 

Images: Pinterest

26 October 2025

కార్తీక మాసంలో సోమవారం పూజ చేసే ముందు చల్లటి నీటితో పవిత్ర స్నానం చేసి మీ శరీరం, మనస్సును శుద్ధి చేసుకోండి. అవకాశం ఉంటే నది స్నానం చెయ్యండి.

తెల్లవారుజామున స్నానం చేయండి

ఈ మాసంలో సోమవారం శివ పూజకు తెల్లని దుస్తులు పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. తెల్లని బట్టలు ధరించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని నమ్మకం.

శుభ్రమైన, తెల్లని దుస్తులు ధరించండి

సోమవారం నాడు శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను, ఇతర పువ్వులు, పండ్లతో పాటు సమర్పించండి. దీనివల్ల ముక్కంటి అనుగ్రహం లభిస్తుంది.

బిల్వ పత్రాలను సమర్పించండి

ఏదైనా శివాలయానికి వెళ్లి శివలింగానికి నీరు, పాలు లేదా ఇతర పవిత్ర పదార్థాలతో అభిషేకం చేయండి. దీంతో మంచి ఫలితాలు ఉంటాయని నమ్మకం.

అభిషేకం చేయండి

పంచాక్షరి మంత్రం ("ఓం నమః శివాయ") లేదా ఇతర శివ మంత్రాలను పఠించండి. దీని వల్ల మనస్సు ప్రశాంతం మారుతుంది.

శివ మంత్రాలను జపించండి

చీకటిపై కాంతి విజయానికి ప్రతీకగా నెయ్యి దీపం లేదా నువ్వుల దీపం వెలిగించండి. ఇలా చేస్తే శివయ్య ఆశీస్సులు లభిస్తాయి.

దీపం వెలిగించండి

కార్తీక మాసం సోమవారం శివుడికి పులిహోర, శనగలు, చెక్కర పొంగలి వంటివి నైవేద్యం పెట్టి, తరువాత దానిని ప్రసాదంగా పంచండి.

నైవేద్యం

కార్తీక మాసంలో దానధర్మాలు చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. పేదలకు దానం చెయ్యడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.

దానధర్మాలు చేయండి