చంద్ర గ్రహణం అయ్యాక ఇలా చేస్తే.. మీ ఇంట అదృష్టం తాండవిస్తుంది.. 

03 September 2025

Prudvi Battula 

ఈ ఏడాది భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్‌ 7 ఆదివారం నాడు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది.

సూతక కాలంలో గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోకూడదు. మీకు ఆరోగ్యం సరిగా లేకపోతే పాలు, పండ్ల రసం వంటివి తీసుకోవచ్చు.

మీరు గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భ గడ్డి లేదా తులసి ఆకులు వేస్తే ఆ ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది.

గ్రహణం సమయంలో వీలైనంత వరకు భగవన్నామ స్మరణ, ధ్యానం చేయడం వంటివి మంచిది. దీనివల్ల మీ ఎలాంటి హానీ జరగదు.

అర్ధరాత్రి 1:26 గంటలకు గ్రహణం ముగియనున్నందున మరుసటి రోజు సెప్టెంబర్ 8 వ తేదీ సోమవారం సూర్యోదయానికి ముందే గ్రహణ స్నానం చేయాలి.

గ్రహణ స్నానం చేసిన తర్వాత ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకున్న తర్వాతనే ఆహారం తీసుకోవాలని శాస్త్రం చెబుతోంది.

చంద్ర గ్రహణం ముగిసిన తర్వాత చేసే దానాలతో మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు పేదవారికి బట్టలు, ఆహారం, ధాన్యం, శక్తిమేర డబ్బు దానం చేయాలి.

సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవలి. ఈ నియమాలనుపాటిస్తే గ్రహణం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.

గ్రహణ స్నానం తర్వాత పితృదేవతలకు పిండ ప్రదానాలు, బ్రాహ్మణులకు గోదానం వంటివి చేయడం చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం.