కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే.. శివకేశవుల ఆశీస్సులు..
20 October 2025
Prudvi Battula
Images: Pinterest
ఇంట్లో పూజ మందిరాన్ని శుభ్రం చేసి, గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిని చల్లి శుద్ధి చేయడం ద్వారా కార్తీక మాసాన్ని ప్రారంభించండి.
పూజ మందిరాన్ని శుభ్రం చేయండి
పూజ మందిరంలో శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి లేదా అన్నపూర్ణ విగ్రహాలను ఉంచండి. విగ్రహాలు లేకపోతో ఫోటోలను పెట్టుకోండి.
శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాలు
విష్ణువుకు పండ్లు, పువ్వులు, తమలపాకులు, తులసి అర్పించండి. శివునికి బిల్వ పత్రాలు, సాధారణ నైవేద్యాలను సమర్పించండి.
నైవేద్యాలు
చీకటిపై కాంతి విజయానికి ప్రతీకగా నెల మొత్తం లేదా ప్రతి సాయంత్రం నెయ్యి దీపం (అఖండ దీపం) వెలిగించండి.
దీపం వెలిగించడం
దైవిక ఆశీర్వాదాలను పొందడానికి మహా మృత్యుంజయ మంత్రం లేదా విష్ణు సహస్రనామం వంటి ఇతర పవిత్ర మంత్రాలను జపించండి.
ప్రార్థనలు, మంత్రాలు
కార్తీక మాసంలో ఉదయాన్నే పవిత్ర స్నానం చేసి, శివుడు లేదా విష్ణువును ధ్యానించి, వారి ఆశీర్వాదాలను కోరుకోండి.
రోజువారీ స్నానం, ధ్యానం
పాక్షిక ఉపవాసాలు పాటించండి, మాంసాహారం, వెల్లుల్లి, ఉల్లిపాయలను నివారించండి. అవసరమైన వారికి ఆహారం, బట్టలు లేదా నిత్యావసరాలను దానం చేయండి.
ఉపవాసం, దానం
ఆధ్యాత్మిక అనుభవాన్ని మెరుగుపరచడానికి, ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి వీలైతే భజనలు, కీర్తనలు, సామూహిక పూజలలో పాల్గొనండి.
భజనలు, కీర్తనలు
మరిన్ని వెబ్ స్టోరీస్
బొటనవేలికి సిల్వర్ రింగ్.. సమస్యలు పోయి.. లైఫ్ అంత స్వింగ్..
మీ జీన్స్ కొత్తగా కనిపించాలంటే.. ఉతికినప్పుడు ఈ తప్పులు చెయ్యొద్దు..
రోజుకో ఉసిరి తింటే.. ఆ సమస్యలకు గోరి కట్టినట్టే..