ఈ పనులు చేసారంటే.. మీ గ్రహ స్థానాలకు బలం.. అదృష్టం వైఫైలా మీ చుట్టూనే..
Prudvi Battula
Images: Pinterest
26 October 2025
జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా ఉంటే ఎరుపు వస్త్రాలని ధరించి ఆదివారం ఉపవాసం ఆచరించాలి. అలాగే ఆదిత్యునికి అర్ఘ్యం సమర్పించాలి.
ఎరుపు వస్త్రాలు ధరించాలి
జాతకంలో కుజుడు బలపడాలంటే ఎర్ర పువ్వులతో హనుమంతునికి పూజ చేసి హనుమాన్ చాలీసాను పాటించాలి. మంగళవారం ఉపవాసం ఆచరించడం మంచిది.
హనుమంతునికి పూజ చెయ్యండి
జాతకంలో చంద్రుడి స్థానం బలంగా ఉండాలంటే సోమవారం ఉపవాసం ఉండటం మంచిది. అలాగే పాలు, వెన్న వంటివి దానం చెయ్యాలి.
పాలు, వెన్న వంటివి దానం
జాతకంలో గురువు స్థానం బలహీనంగా ఉన్నట్లైతే గురువారం పసుపు రంగు బట్టల్ని ధరించి ఉపవాసం దీక్ష చెయ్యాలి. పసుపు దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
గురువారం పసుపు రంగు బట్టలు
జాతకంలో బుధుడి స్థానం బలహీన పాడినప్పుడు పచ్చని బట్టలను ధరించి వినాయకుడిని ఆరాధించండి. అలాగే తులసి మొక్కకి నీరు పోయండి.
పచ్చని బట్టలను ధరించాలి
శని బలహీనంగా ఉన్న జాతకులు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిది. హనుమంతుడిని పూజ చెయ్యాలి. శనివారం నల్ల నువ్వులు, నల్ల బట్టలను దానం చేయాలి.
నువ్వుల నూనెతో దీపారాధన
జాతకంలో శుక్రుడు బలపడాలంటే లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించాలి. శుక్రవారం తెల్ల బట్టలు వేసుకొని వెండి ఆభరణాలు ధరించాలి.
శుక్రవారం తెల్ల బట్టలు
జాతకంలో రాహువు బలంగా ఉండాలంటే సర్పదేవతల్ని పూజించడం చాలా ముఖ్యం. అలాగే నల్ల నువ్వులను దానం చేయడం మంచిది.
నల్ల నువ్వులు దానం
కేతువు స్థానం బలహీనంగా జాతకులు వినాయకుడిని భక్తితో పూజించాలి. "ఓం కేతవే నమః" అంటూ మలుమార్లు జపించాలి. కుక్కలకు ఆహారం పెట్టడం మంచిది.
వినాయకుడిని భక్తితో పూజించాలి
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ఫుడ్స్ చీమలకు ఆహారంగా పెడితే.. అదృష్టం వరిస్తుంది..
పసుపు జుట్టు సమస్యలపై యమపాశం.. ఇలా తీసుకుంటే అన్ని ఖతం..
ఒత్తిడిని లైట్ తీసుకుంటున్నారా.? సంతానోత్పత్తిపై ఎఫెక్ట్..