ఇంట్లో డబ్బులు నిలవడం లేదా.. హోలీ రోజు ఈ టిప్స్ పాటించండి!
samatha
13 march 2025
Credit: Instagram
చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టపడే పండుగలలో హోలీ పండుగ ఒకటి. ఈ ఫెస్టివల్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రంగులతో చాలా ఏంజాయ్ చేస్తుంటారు.
అయితే పండుగ రోజు ఓ చిన్న పరిహారం చేస్తే డబ్బుకు లోటే ఉండదు అంటున్నారు పండితులు. అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవంట. కాగా, అది ఏంటో తెలుసుకుందాం.
హోలీ పండుగ వచ్చేస్తుంది. మార్చి 14 శుక్రవారం రోజు ప్రజలందరూ ఎంతో ఇష్టంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. మరీ ముఖ్యంగా పెద్ద వారు కూడా చిన్నపిల్లలుగా మారి రంగులు చల్లుకుంటూ చాలా ఏంజాయ్ చేస్తారు.
అయితే ఈ రోజున కొన్ని పరిహారాలు పాటించడం వలన జీవితంలో ఉన్న ఆర్థికసమస్యలు అన్ని తొలిగిపోతాయి అంటున్నారు జ్యోతిష్యులు. అవి ఏవి అంటే?
హోలీ పండుగ రోజు కొన్ని రకాల పండ్లను దానం చేయడం చాలా మంచిదంట. అంతే కాకుండా దీనివలన మీకు భగవంతుడి ఆశీస్సులు ఉండటమే కాకుండా, ఆర్థికంగా కూడా ధృఢంగా ఉంటారంట.
అదే విధంగా పేదలకు వస్త్ర దానం, చెప్పులు లేదా చలివేంద్రాలు ఏర్పాటు చేసి నీరు దానం చేయడం వలన దేవుని అనుగ్రహం మీపై ఉంటుందంట.
మరీ ముఖ్యంగా హోలీ పండుగ రోజు పురోహితుడికి నవధాన్యాలు దానం ఇవ్వటం వలన మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ పోయి, మీ ఆర్థికసమస్యలు తీరిపోయి చేతినిండా డబ్బే ఉంటుందంటున్నారు పండితులు.
అందువలన హోలీ రోజున త్పకుండా ఆర్థిక సమస్యలతో బాధపడేవారందూ ఈ టిప్స్ పాటించాలని పండితులు తెలియజేస్తున్నారు.