పోలి స్వర్గం.. కార్తీక మాసం చివరి రోజు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం మీదే!

Samatha

20 November 2025

హిందూ మతంలో కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి.

ఇక కార్తీక మాసం అక్టోబర్ 22న మొదలై, నవంబర్ 20తో ముగుస్తుంది. అంటే నేటితో కార్తీక మాసం ముగిసింది. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ దీపారాధన చేస్తుంటారు.

అయితే  కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది. అయితే ఆ మరసటి రోజుతో మార్గశిరమాసం ప్రారంభం అవుతుంది.

దానిని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజున ప్రత్యేక పూజలు చేసి, నీటిలో దీపాలు వదలడం చాలా మంచిదని చెబుతుంటారు.

కార్తీక మాసం అమావాస్ తర్వాత మార్గశిర పాడ్యమి రోజును పోలి పాడ్యమి అంటారు. ఈ రోజుతో కార్తీకవ్రతం పూర్తి అవుతుంది.

కార్తీక మాసం అమావాస్ తర్వాత మార్గశిర పాడ్యమి రోజును పోలి పాడ్యమి అంటారు. ఈ రోజుతో కార్తీకవ్రతం పూర్తి అవుతుంది.

శుక్రవారం పోలి స్వర్గం. అయినప్పటికీ శని వారం రోజున దీనిని జరుపుకోవాలంట, నేడు నీటిలో దీపాలు వదలడం,  దీపం వెలిగించడం వలన కోటి జన్మల పుణ్యం లభిస్తుందంట.

అయితే శుకర వారం రోజున అమ్మవారిని ఇంటి నుంచి పంపించకూడదని , శని వారం పోలి స్వర్గం జరుపుకోవాలి అంటున్నారు పండితులు. ఈ రోజున తప్పకుండా తులసి మాతకు పూజలు చేసి దీపం వెలిగించాలి.