వినాయక చవితి 10 రోజులే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Samatha

27 August  2025

Credit: Instagram

పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే గణేష్ చతుర్థి వచ్చేసింది. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తేదీన గణేష్ చతుర్థి జరుపుకుంటారు

నేడు (ఆగస్టు27) బుధ వారం రోజున ప్రతి పల్లె, పట్నంలో చిన్న వారి నుంచి పెద్ద వారికి వరకు ప్రతి ఒక్కరూ ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు.

 వినాయకుడి విగ్రహాన్ని ఈరోజు మండపంలో ప్రతిష్టించి పది రోజుల పాటు గణపయ్యకు రోజూ రెండు సార్లు పూజలు చేసి భజనలు చేస్తుంటారు.

అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వినాయకుడిని పది రోజుల పాటే ఎందుకు ఉంచుతారు? ఈ రోజుల్లోనే పూజలు ఎందుకు చేస్తారు.

కాగా, దాని గురించే తెలుసుకుందాం. గణేష్ ఉత్సవాలను 10 రోజులు మాత్రమే నిర్వహించడం వెనుక ఓ కారణం ఉన్నదంట.అది ఏమిటంటే?

కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ పండుగను ఒక్క రోజు మాత్రమే జరుపుకునే వారంట. కానీ బాలగంగాధర్ తిలక్ పది రోజులు జరుపుకునే సంప్రదాయాన్ని తీసుకొచ్చాడంట.

అలాగే పురణాల ప్రకారం, వ్యాసమహర్షి మహాభారతం రాయమని వినాయకుడిని కోరగా, ఆయన నేను రాయడం మొదలు పెడితే ఆగకుండా రాస్తాను అన్నాడంట.

దానికి వ్యాసమహర్షి, చాలా మంచిది మీరు మధ్యలో ఆగిపోకుండా శ్లోకాలు చెబుతా అని ప్రామిస్ చేశాడంట. అలా వినాయకుడు, కళ్లు మూసుకోకుండా, బ్రేక్ లేకుండా 10 రోజుల్లో రాశాడంట.

దీంతో పది రోజుల పాటు నిర్విరామంగా రాయడం వలన వినాయకుడి బాడీ టెంపరేచర్ చాలా పెరిగిందంట. దీంతో ఆ వేడిని తగ్గించడానికి వ్యాసమహర్షి నదిలో వినాయకుడిని ముంచుతాడంట.

అలా, దీన గుర్తు చేసుకుంటూ, 10 రోజుల పాటు వినాయకుడి ఉత్సవాలు జరుపుకుంటారని చెబుతుంటారు పండితులు.