బాయ్స్.. మీ క్యారెక్టర్ ఇలా ఉంటే.. అమ్మాయిలు అంతా మీ వెంటే..

05 September 2025

Prudvi Battula 

అటుకులు.. ఆహారంగా కంటే దేవునికి సమర్పించే ప్రసాదంగానే ప్రాచుర్యం పొందింది. దాదాపు అన్ని పూజలు, పండగలకు వీటిని ప్రసాదంగా ఉంచుతారు.

అటుకులకు దేవుని ప్రసాదంగా ఇంతటి స్థానం రావటానికి ఓ పెద్ద కథే ఉంది. అది ద్వాపర యుగం నాటి ఇద్దరి ప్రాణస్నేహతులకు ప్రతీక.

శ్రీకృష్ణుడు, కుచేలుడు (సుదాముడు) స్నేహం గురించి మనందరికి తెలిసిందే. ఇది నిస్వార్థమైనది, ఆదర్శప్రాయమైనది.

సాందీపని గురుకులంలో విద్యాబ్యాసం చేస్తున్నప్పటి నుంచి వీరిద్దరూ మంచి మిత్రులు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం.

అలా కాలక్రమేణా శ్రీ కృష్ణుడు ద్వారకాధిపతి అయినా కథ మనకి తెలిసిందే. కుచేలుడు మాత్రం పేద బ్రాహ్మణుడిగా మిగిలిపోయాడు.

ఆలా ఓ రోజు తన భార్య సలహాతో స్నేహితుడు శ్రీకృష్ణుడిని కలిసి తన పేదరికం గురించి చెప్పడానికి కొన్ని అటుకులు పట్టుకొని వెళ్తాడు కుచేలుడు.

తన చిన్ననాటి స్నేహితుడిని చూసిన శ్రీకృష్ణుడు ప్రేమగా స్వాగతించి కుచేలుడిని సింహాసనంపై తాను కింది కూర్చున్నాడు.

మిత్రమా.. నా కోసం ఏమి తీసుకొని వచ్చావ్ అని కుచేలుడిని కృష్ణుడికి అడగడంతో అటుకులతో పాటు రుచి కోసం చిన్న బెల్లం ముక్క ఇస్తాడు.

అటుకులు, బెల్లం అందంగా తింటాడు గోవర్దదారుడు. తర్వాత కుచేలుడు అడగకముందే కృష్ణుడు తన పేదరికాన్ని తొలగించి అష్టైశ్వర్యాలు కల్పించాడు.

అప్పటినుంచి అటుకులకు ప్రసాదంలో అగ్ర స్థానం వచ్చింది. దేవునికి అటుకులు సమర్పిస్తే.. అన్ని కష్టాలు తీరిపోతాయని నమ్మకం ఏర్పడింది.