భారత్‌లోని ఈ ఆలయాల వార్షికాదాయం ఎంతో తెలుసా?

TV9 Telugu

22 February 2025

జమ్మూలోని వైష్ణో దేవి ఆలయం వార్షిక ఆదాయం 2 వేల కోట్ల రూపాయలు వరకు వస్తుంది. దీంతో ఇది టాప్‎లో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం రూ.1,650 కోట్లు వార్షికాదాయంతో రెండు స్థానంలో నిలిచింది.

గత ఏడాది నిర్మించబడిన అయోధ్య బాల రామాలయం ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. దీని వార్షికాదాయం రూ. 700 కోట్లు.

పంజాబ్‎లోని సిక్కుల పవిత్ర క్షేత్రం అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్ రూ. 500 కోట్లు వార్షికాదాయం నాలుగవ స్థానంలో ఉంది.

మహారాష్ట్రలోని షిర్డీ సాయి బాబా సంస్థాన్ వార్షికాదాయం రూ. 400 కోట్లుగా ఉంది. ఈ జాబితాలో సాయి బాబా ఆలయం టాప్ 5లో నిలిచింది.

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరం ఉన్న సిద్ధివినాయక దేవాలయనికి భక్తుల ద్వారా రూ. 125 కోట్లు వార్షికాదాయం లబిస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నగరం వారణాసిలోని కాశీ విశ్వనాధుని దేవాలయం ఆదాయం ఏడాదికి రూ. 100 కోట్లు అనే నివేదిక చెబుతుంది.

గురువాయూర్ దేవస్వోమ్ రూ. 60 కోట్లు, మీనాక్షి ఆలయం రూ. 30 కోట్లు, శ్రీ జగన్నాథ్ ఆలయం రూ. 20 కోట్లు, పద్మనాభస్వామి ఆలయం రూ. 12 కోట్లు, సోమనాథ్ ఆలయం రూ. 10 కోట్లు వార్షికాదాయం  లభిస్తుంది.