నాగులకు నిజంగా మణి ఉంటుందా.? సైన్స్ ఏం చెబుతుంది.? 

07 September 2025

Prudvi Battula 

పాములంటే.. దాదాపు అందరూ భయంతో పారిపోతారు. ఇక నాగుపాముని చూడగానే ప్రతి ఒక్కరు ఆమడ దూరం పరిగెత్తుతారు.

నాగుపాము తలపై నాగమణి ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. అది కనిపిస్తే ప్రాణాలకు తెగించి అయినా సరే.. దానిని సొంతం చేసుకోవాలని ప్రచారంలో ఉంది.

నాగమణి దక్కిన వారికి ప్రాణాపాయం ఉండదని, వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని కూడా చాలా మంది నమ్ముతుంటారు.

చాలా సినిమాల్లో నాగమణి ఉన్నట్టుందని, దాని ప్రభావాన్ని చూపించాయి. నాగరాజు, నాగకన్య తలపై నాగమణితో ఎవరినైనా నియంత్రించగలదని చెబుతారు.

పౌరాణిక వాస్తవాల ప్రకారం ఇది నిజమని భావించినప్పటికీ, సైన్స్ కోణలో ఇందుకు ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు.

నాగమణిపై అత్యాశతో చాలా పాముల ప్రాణాలు బలిచేశారని, కానీ, ఇప్పటి వరకు ఒక్క పాములో కూడా కనిపించలేదని చెబుతున్నారు.

నాగమణి నాగుపాము తలలో ఉంటుందనేది కేవలం కొంతమందిలో ఉన్న మూఢనమ్మకమే, ఇది వాస్తవం కాదంటున్నారు నిపుణులు.

పాముల గురించి మరొక పెద్ద అపోహ ఏమిటంటే పాములు పగబడతాయని, అవి ప్రతీకారం తీర్చుకుంటాయని, కానీ పాములు ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోలేవని చెబుతున్నారు.