దీపావళి స్పెషల్.. టేస్టీ మైసూర్ పాక్.. ఇంట్లోనే తయారీ..
17 October 2025
Prudvi Battula
Images: Pinterest
దీపావళి పండుగ సమీపిస్తున్న కొద్దీ, ప్రజలు తమ ఇళ్లలో వివిధ రకాల రుచికరమైన వంటకాలను తయారు చేయడం ప్రారంభించారు.
దీపావళి
పండక్కి గులాబ్ జామున్, పాయసం వంటి సాధారణ స్వీట్లు చాల మంది తయారు చేస్తారు. అయితే రుచికరమైన మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం.
డెజర్ట్‌లు
మైసూర్ పాక్ తాయారు చేయడనికి అవసరమైనంత నెయ్యి, 2 కప్పుల శనగపిండి, 4 కప్పుల చక్కెర, అవసరమైనంత నూనె తీసుకోండి.
పదార్థాలు
ముందుగా శనగ పిండిని బాగా జల్లెడ పట్టి, కొద్దికొద్దిగా నీళ్లు పోసి ముద్దలు లేకుండా పిసికి కలుపుకోవాలి.
రెసిపీ
స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, అందులో నీళ్లు పోసి, అది మరుగుతున్నప్పుడు, చక్కెర వేసి, మీడియం మంట మీద సిరప్ లాంటి చిక్కదనం వచ్చే వరకు కలపండి.
చక్కెర సిరప్
తరువాత, శనగ పిండిని కొద్దికొద్దిగా వేసి కలుపుతూ ఉండండి. రెండూ కలిపిన తర్వాత, కొద్దిగా నెయ్యి వేసి కలపండి.
నెయ్యి వేయండి
తరువాత నూనె పోస్తూ, అది బుడగలు రావడం ప్రారంభించినప్పుడు కదిలిస్తూ, స్టవ్ ఆఫ్ చేసి, అలాగే ఉంచండి.
నూనె
ఈ మిశ్రమాన్ని నెయ్యి లేదా వెన్నతో గ్రీజు చేసిన ట్రేలో పోయాలి. మరీ గట్టిగా నొక్కకండి, చల్లారిన తర్వాత, ముక్కలు చేస్తే, మైసూర్ పాక్ సిద్ధంగా ఉంటుంది.
ట్రేలో పోయాలి
చిన్న చిట్కా ఏంటంటే శనగ పిండితో కొంచెం పప్పు పిండి కలిపితే పిండి మెత్తగా అవుతుంది, గిన్నెకు అంటుకోదు.
చిట్కా
మరిన్ని వెబ్ స్టోరీస్
బొటనవేలికి సిల్వర్ రింగ్.. సమస్యలు పోయి.. లైఫ్ అంత స్వింగ్..
మీ జీన్స్ కొత్తగా కనిపించాలంటే.. ఉతికినప్పుడు ఈ తప్పులు చెయ్యొద్దు..
రోజుకో ఉసిరి తింటే.. ఆ సమస్యలకు గోరి కట్టినట్టే..