చాణక్య నీతి: పెళ్లికి ముందు భాగస్వామిలో ఈ గుణాలు ఉంటేనే దాంపత్య జీవితం సుఖమయం!

28 June 2026

Rajashekher

భార్యాభర్తలు ఒకే రథానికి రెండు చక్రాలు: ఇద్దరూ సమానంగా బాధ్యతలు పంచుకుని ముందుకు సాగితేనే కుటుంబ జీవితం సజావుగా సాగుతుంది.

 బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి: భర్త, భార్య ఇద్దరూ తమ కర్తవ్యాలను నిజాయితీగా నిర్వర్తిస్తే కుటుంబంలో ఆనందం, స్థిరత్వం ఉంటుంది.

వివాహానికి ముందు భాగస్వామి గుణాలను పరిశీలించాలి: కేవలం రూపం లేదా సంపద కాకుండా, వ్యక్తిత్వం, నడవడి, విలువలను కూడా గమనించాలి.

మాటల్లో స్పష్టత, నిజాయితీ ఉండాలి:  అవసరమైనప్పుడు కఠినంగా అయినా నిజం చెప్పే వ్యక్తి నమ్మదగినవాడు. మోసపూరిత ఉద్దేశాలు ఉండవని చాణక్యుడు సూచిస్తాడు.

అతి మధురమైన మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి: అతిగా పొగిడే లేదా ఎప్పుడూ తీపి మాటలే మాట్లాడే వ్యక్తి వెనుక స్వార్థం దాగి ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తాడు. 

సహనం అత్యంత ముఖ్యమైన గుణం: ఓర్పు ఉన్న వ్యక్తి సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించగలడు. అందుకే సహనం ఉన్న భాగస్వామిని ఎంచుకోవాలని చెబుతాడు.

చంచల స్వభావం, అసంతృప్తి ఉన్నవారిని దూరంగా ఉంచాలి: ఎప్పుడూ అసంతృప్తిగా, స్థిరమైన ఆలోచనలు లేని వ్యక్తితో వైవాహిక జీవితం కష్టంగా మారవచ్చని సూచిస్తాడు.

భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వివాహ నిర్ణయం తీసుకోవాలి: వారి స్వభావం, ప్రవర్తన, విలువలను గమనించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని చెబుతాడు.

భార్యాభర్తల మధ్య విషయాలు గోప్యంగా ఉండాలి:   కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను మూడో వ్యక్తితో పంచుకోకుండా పరస్పర విశ్వాసాన్ని కాపాడుకోవాలని చాణక్యుడు సూచిస్తాడు.