చాణక్య నీతి : పురుషులు అస్సలే చేయకూడని ఐదు పనులివే!

Samatha

26 july  2025

Credit: Instagram

ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గొప్ప పండితుడు. అనేక అంశాలపై పట్టు ఉన్న వ్యక్తి.

చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా అనేక విషయాలను తెలియజేయడం జరిగింది. అయితే ఆయన పరుషులకు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు.

ఎలాంటి సమయంలోనైనా సరే పురుషులు కొన్ని రకాల తప్పులు అస్సలే చేయకూడదంట. అవి వారి పతనానికి కారణం అవుతాయంట. అవి ఏవి అంటే?

ఆ చార్య చాణక్యుడి ప్రకారం పురుషులు తప్పనిసరిగా స్త్రీలను గౌరవించాలంట. మహిళలను గౌరవించని పురుషులు నాశనం అవుతారంట.

చాణక్య నీతి ప్రకారం పురుషులు అస్సలే కోపంలో ఏ నిర్ణయం తీసుకోరాదంట. దాని వలన చాలా సమస్యల్లో చిక్కుకుంటారంట.

చాణక్యుడి ప్రకారం సహవాసం మంచిదై ఉండాలంట. చెడు స్నేహం ఎప్పుడూ కష్టాలను తీసుకొస్తుందని చెబుతున్నారు పండితులు.

చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తికి ముఖ్యంగా పరుషులకు సంపద పట్ల గర్వం ఉండకూడదంట. ఉంటే, అతని పతనం ఖాయం అంట.

చాణక్యుడి ప్రకారం పురుషులు ఎప్పుడూ తమ రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదంట. ఇది వారి జీవితంలో కష్టాలను తీసుకొస్తుందంట.