చాణక్య నీతి : స్త్రీ గురించి ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సిన ఐదు విషయాలివే!

02 September 2025

Samatha

ఆచార్య చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడు, తెలివైన వ్యక్తి . ఈయనను గొప్ప పండితుడు అని కూడా పిలుస్తారు.

ఇక చాణక్యుడు తన జీవితంలోని అనుభవాల ఆధారంగా ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రాజకీయాలకే పరిమితం కాదు.

ఈయన జీవితాన్ని గడపడం, బంధాలు గురించి తెలిపారు. అలాగే మహిళలు, స్త్రీ,పురుషుల స్వభావం, లక్షణాల గురించి వివరంగా తెలిపారు.

అదే విధంగా స్త్రీలలో ఉండే గొప్ప లక్షణాలు,  వారిని పురుషులు అర్థం చేసుకుంటే, జీవితంలో ఎంత గొప్ప స్థాయికి వెళ్తారో ఆయన వివరంగా తెలియజేయడం జరిగింది.

చాణక్యుడు స్త్రీలు చాలా తెలివైన వారని నమ్మారు. అందుకే వారు పరిస్థితులను అర్థం చేసుకోవడంలో నిర్ణయాలు తీసుకోవడంలో చాలా బెటర్‌గా ఉంటారంట, పురుషులు  వీరి మాట వినాలంట.

స్త్రీలకు ఓపిక, త్యాగం చాలా ఎక్కువ. వీరు తమ కుటుంబం కోసం కోరికలు, ఆనందాన్ని వదిలివేస్తారు. అందుకే పురుషులు వీరిని అభినందించాలంట.

స్త్రీలకు భావోద్వేగం కోపం చాలా ఎక్కువ. వారు భావోద్వేగంగా ఉన్నారంటే, పెద్ద సమస్యలో ఉన్నట్లే, అందుకే పురుషులు వారి భావోద్వేగాన్ని అర్థం చేసుకోవాలంట.

అలాగే స్త్రీ నిజమైన అందం, తన రంగు, రూపంలో ఉండదు, గుణం, ప్రవర్తన, నడవడికలో ఉంటుంది. అందుకే లక్షణాలకే పురుషులు ప్రాధాన్యత ఇవ్వాలంట