చాణక్యనీతి : ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ప్లేసెస్‌లో ఇల్లు కట్టకండి.. లేకపోతే ప్రాణానికే ముప్పు!

Samatha

17 august  2025

Credit: Instagram

ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గొప్ప పండితుడు, తత్వవేత్త, అన్ని భాషల్లో మంచి పట్టు ఉన్న వ్యక్తి.

ఇక చాణక్యుడు చాలా విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే.  అలాగే ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారి గురించి కూడా కొన్ని విషయాలు తెలిపారు.

చాలా మంది కల ఒక అందమైన ఇళ్లు నిర్మించుకోవడం. అయితే ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు ఎట్టి పరిస్థితుల్లో  కొన్ని ప్రదేశాల్లో ఇంటిని నిర్మించుకోకూడదంట. అవి ఏవి అంటే?

మీరు ఏదైనా ప్రదేశానికి వెళ్లినప్పుడు అది చాలా భయానకంగా అనిపిస్తే లేదా అభద్రతభావం కలిగితే ఎట్టిపరిస్థితుల్లో ఆ ప్లేస్‌లో ఇల్లు నిర్మించుకోకూడదంట.

అలాగే సమాజం లేదా చట్టం పట్ల భయం లేని చోట ఇల్లు నిర్మించుకోవడం అస్సలే సరైనది కాదు, ఎట్టిపరిస్థితుల్లో అక్కడ ఇళ్లు నిర్మించుకోకూడదంట.

అలాగే ఏ ప్రదేశంలో అయితే ప్రజలు సిగ్గు, గౌరవం వంటివాటిని విస్మరిస్తారో, అలాంటి ప్రదేశాల్లో అస్సలే ఇల్లును కట్టుకోకూడదంట.

అదే విధంగా జీవనోపాధి లేని ప్రదేశంలో ఇల్లు నిర్మించుకున్నా అది వ్యర్థమే అంటున్నారు ఆ చార్య చాణక్యుడు.

అంతే కాకుండా మీరు ఇల్లు కట్టుకునే ప్రదేశంలో ఎక్కువ ప్రజలు లేకపోయినా, అలాగే పరొపకారం త్యాగం లేదు అనిపిస్తే అక్కడ ఇళ్లు తీసుకోకపోవడమే మంచిదంట.