సండే నాన్ వెజ్ తినొచ్చా.? పండితులు ఏం అంటున్నారు.?

12 October 2025

Prudvi Battula 

సండే వచ్చింది అంటే ఇంట్లో నాన్-వెజ్ పక్కాగా ఉండాల్సిందే. చికెన్, మటన్, ఫిష్ అంటూ ఇంట్లో వండుకొని తింటారు.

చాలామంది ఇంట్లో వండుకొని తింటే.. కొంతమంది మాత్రం రెస్టారెంట్‎కి వెళ్లి తింటారు. కానీ ఆదివారం చికెన్ తినడం మాత్రం కామన్.

అయితే ఆదివారం నాన్ వెజ్ తినడం మంచిదేనా.? అని అడిగితే.. శుభప్రదం కాదని బదులిస్తున్నారు హిందూ పండితులు.

ఆదివారం నాడు సూర్యునికి ప్రాధాన్యత ఇస్తూ మాంసాహారం భుజించకుండా ఉండాలని అనేక హిందూ పురాణాలు చెబుతున్నాయి.

ఆదివారం సూర్యారాధన చేసేటప్పుడు చికెన్, మటన్, చేపలు వంటివి ఆహారాలు మానేయాలని మన పండితులు చెబుతున్న మాట.

పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల ఆదివారం నాన్-వెజ్ తినడం ఒక అలవాటుగా మారిందని కొందరు పండితులు పేర్కొన్నారు.

అలాగే ఆదివారం రోజున చాలామంది పార్టీలు అంటూ మద్యపానం చేస్తుంటారు. ఇది కూడా మంచిది కాదని హెచ్చరిస్తుంది.

ఈ మధ్య పార్టీ కల్చర్ దేశవ్యాప్తంగా యువతలో బాగా పెరిగిపోయింది. ఇది అంత మంచిది కాదని పండితులు అంటున్నారు.