మెయిన్ డోర్ పక్కన వీటిని పెడుతున్నారా.? ధననష్టం.. జాగ్రత్త..
Prudvi Battula
Images: Pinterest
25 October 2025
ఇంటి గుమ్మంలో లేదా ముందు తలుపు దగ్గర చాలా మంది అద్దాలు పెడతారు. ఇది నెగెటివ్ ఎనర్జీని తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అద్దాలు
ఇంటికి ఎదురుగా కత్తులు, గొడ్డళ్లు, గునపాలు పెట్టకపోవడమే మంచిది. వీటిని స్టోర్ రూమ్‌లో ఓ మూలన పెట్టుకోవాలి.
కత్తులు, గొడ్డళ్లు, గునపాలు
విరిగిన వస్తువులను ఇంటి ముందు పెట్టడం మంచిది కాదు. దీని వల్ల జీవితంలో సమస్యలు వస్తాయట. వీటిని ఎప్పటికప్పుడు పారేయడమో.. స్టోర్ రూమ్‌లో పెట్టడమో చేయాలి.
విరిగిన వస్తువులు
చాలా మంది చెప్పులను ఇంటి గుమ్మానికి ఎదురుగా విడుస్తారు. ఇలా చేయకుండా గుమ్మానికి పక్కన చెప్పులు ఉంచడం మంచిది.
చెప్పులు
చెప్పులని ఎలా పడితే అలా విడవకుండా.. ఓ స్టాండ్ లో చక్కగా అమర్చాలి. దీనివల్ల ఇంట్లో ఎలాంటి సమస్యలు దరిచేరవు.
చెప్పులు స్టాండ్
చెత్తను ఇంటి గుమ్మంలో, తలుపు దగ్గర అస్సలు ఉంచకూడదట. ఇది మంచిది కాదని.. నెగెటివ్ ఎనర్జీని ఇంట్లో తీసుకొస్తుందని హెచ్చరిస్తున్నారు.
చెత్త
ఇంటి గుమ్మం ఎప్పుడు కూడా వెలుగులోనే ఉండాలని.. గుమ్మం వద్ద చీకటి అస్సలు ఉండకూడదని అంటున్నారు నిపుణులు.
చీకటి ఉండకూడదు
డోర్ దగ్గర ఎక్కువగా వెలుతురు కోసం వీలైతే కొన్ని లైట్లు పెట్టడం మంచిదని అంటున్నారు వాస్తుశాస్త్ర పండితులు.