వివాహ బంధంలో విభేదాలా.? ఏ రాశివారి ఎలాంటి పరిహారాలు చెయ్యాలంటే.?

Prudvi Battula 

Images: Pinterest

31 October 2025

మేష రాశి వారికి కోపం ఎక్కువ. ఇది వైవాహిక జీవితంలో హృదయ వేదనను కలిగిస్తుంది. ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామికి పూజలు చేయడం దీనికి నివారణ.

మేషరాశి

వృషభ రాశి వారు సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల భాగస్వామితో విభేదాలు వస్తే శుక్రవారాల్లో ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తే సమస్య పోతుంది.

వృషభం

మిథున రాశి వారు తమ ఇష్టానుసారం జరగాలని అనుకున్నందున పార్టనర్‎తో సమస్యలను కలిగిస్తుంది. దీనిని నివారించడానికి, మీరు ప్రతి గురువారం గురు భగవానుడిని పూజించవచ్చు.

మిథున రాశి

కర్కాటక రాశి వారులో అభిరుచులను మార్చుకునే ధోరణి సంబంధాలలో సమస్యలను కలిగిస్తుంది. వీటిని నివారించడానికి,విష్ణువుకు పాలు అర్పించి ప్రార్థనలు చెయ్యండి.

కర్కాటక రాశి

సింహ రాశి వారు ఆధిపత్యం చెలాయించటానికి ఇష్టపడతారు. ఇది సంబంధాలలో వాదనలకు దారితీస్తుంది. వారు ప్రతి ఉదయం సూర్య నమస్కారం చెయ్యాలి. స్త్రీలు గురువారం ఉపవాసం ఉండవచ్చు.

సింహ రాశి

కన్యరాశి వారు చేసే పనులలో చూపే సంయమనం వైవాహిక జీవితంలో హృదయ వేదనకు కారణమవుతుంది. దీనిని నివారించడానికి ఆవుకు పచ్చ గడ్డి తినిపించవచ్చు.

కన్య రాశి

తులా రాశి వారు అందం, విలాసం, పేరు, కీర్తికి అధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఇది వివాహ జీవితంలో కొన్ని సమస్యలను తెస్తుంది. నివారణకి ప్రతి శుక్రవారం విష్ణువుకి పూజలు చేయవచ్చు.

తులా రాశి

వృశ్చిక రాశి వారు అసహజ కోరికలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు.ఇది బంధాలలో సమస్యలను తెచ్చిపెడుతుంది. నివారించడానికి ప్రతి మంగళవారం లక్ష్మీ దేవిని పూజించాలి.

వృశ్చిక రాశి

ధనుస్సు రాశి వారికి తరచుగా విభేదాలు తలెత్తడం వల్ల వారి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురుకావచ్చు. ఈ సమస్యలను అధిగమించడానికి ఆవుకు పప్పు, బెల్లం తినిపించవచ్చు.

ధనుస్సు రాశి

మకర రాశి వారు శని ఆధిపత్యం కారణంగా భాగస్వామితో తరచుగా వాదనలకు దిగుతారు. శనివారాల్లో నవగ్రహలకు ఆవ నూనెతో దీపం వెలిగించి పూజించాలి.

మకర రాశి

కుంభ రాశి వారు తరచుగా అభిప్రాయ భేదాల కారణంగా పార్టనర్‎తో వాదనలకు దిగుతారు. ప్రతి నెలా 2వ శనివారం రావి చెట్టుతో పాటు పెరిగిన వేప చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి.

కుంభ రాశి

మీన రాశి వారు మొండితనం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. ప్రతి గురువారం గురువును స్మరించి "ఓం గ్రామ్ క్రీం గ్రామ్ సహ గురవే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి!

మీన రాశి