చీపురు ఆ డైరెక్షన్‎లో ఉంచితే.. డబ్బే డబ్బు.. కుబేరులు అయిపోయినట్టే..

07 September 2025

Prudvi Battula 

ఇంట్లో వస్తువులన్నింటిలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అలాగే చీపురు కూడా సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం.

చీపురు ఆగ్నేయ, నైఋతి, వాయవ్య, ఈశాన్య మూలల్లో ఉంచవచ్చు. కానీ దక్షిణ, పడమర మధ్య ఉంచడం మరింత సరైనదిగా పరిగణించబడుతుంది.

అదేవిధంగా చీపురును నిలువుగా ఉంచకూడదు. ఎల్లప్పుడూ అడ్డంగా ఉంచాలి. ఎప్పుడూ తూర్పు ముఖంగా ఉంచడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి.

చాలా మంది తరచుగా ఇంటిని తుడుస్తూ ఉంటారు. కానీ జ్యోతిష్యులు ప్రకారం మాత్రం ఇది తప్పుగా పరిగణించబడుతుంది.

ఇలా చేస్తే నష్టం జరుగుతుంది. ఇల్లు శుభ్రం చేయడానికి ఉత్తమ సమయం ఉదయం, సాయంత్రం మాత్రమే అంటున్నారు పండితులు.

స్త్రీ అయినా, పురుషులైనా సరే, ఉదయం నిద్ర లేవగానే మొదటగా ఇల్లు ఊడ్చే ముందు దేవుని పూజించాలి. దీని తర్వాత ఇంటిని శుభ్రం చేయండి.

చీపురుతో ఇంటిని శుభ్రం చేసినప్పుడు, ముందుగా పశ్చిమం లేదా ఉత్తరం వైపు నుండి తుడుచుకోవడం ప్రారంభిస్తే లక్ష్మిదేవి అనుగ్రహం లభిస్తుంది.

అదే సమయంలో, ఊడ్చిన తర్వాత, మురికి చెత్తను డస్ట్‌బిన్‌లో వేయాలి. ప్రతిచోటా చెత్త కుప్పలు వేస్తే పేదరికం, కష్టాలు పెరుగుతాయి.