మీరు నమ్మిందే జరుగుతుంది.. భగవద్గీత నుంచి 8 ముఖ్యమైన పాఠాలు

samatha 

18 February 2025

Credit: Instagram

మీరు ఏదైతే బలంగా నమ్ముతారో అదే జరుగుతుందని భగవద్గీతలో తెలపడం జరిగింది. నమ్మకం అనేది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది.  మనం నమ్మకంతో ఉంటే ఏదైనా చేయగలం, సాధించగలం.

ప్రశాంతమైన మనసు మనలోని భావాలను నియంత్రించడానికి సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో చాలా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే మనం మంచి నిర్ణయం తీసుకోగలుగుతాం.

నువ్వు నీ విధులను నిర్వహించుకుంటూ పోతే, దాని ఫలితం అదే వస్తుంది. కానీ ఫలితానికి కారణం నువ్వే అని ఎప్పుడూ అనుకోకూడదని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో తెలిపారు.

ఏ విషయాన్నైనా గ్రహించడం అవసరం. కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు తాను ఏం చేయగలడు, చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందనేది ఊహించుకోలేకపోయాడు.

దీని వలన ఆయన యుద్దం చేయడానికి నిరాకరించాడు. అందువల్ల నువ్వు ఏం చేయాలి? ఎందుకు చేయాలి అనే విషయాలపై సరైన అవగాహన ఉంటే విజయం సాధిస్తావు

భగవద్గీత ప్రకారం ఒక వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలంటే, పరిస్థితులకు అనగుణంగా మారాలి అంటున్నాడు కృష్ణుడు. సమస్యల పరిష్కారాలు కనుగొంటూ ముందుకు సాగాలంట.

మీరు సరిగ్గా ఆలోచిస్తే మీరు చేయలేని అంటూ ఏదీ ఉండదు. అందువల్ల విజయం సాధించేవారు పాజిటివ్‌ ఆలోచించాలి.

భగవద్గీత వ్యక్తి శరీరం చాలా తాక్కాలికం అయినది, ఆత్మ శాశ్వతం. శరీరాన్ని మనం నాశనం చేయొచ్చు కానీ ఆత్మను నాశనం చేయలేమని తెలిపింది.