క్రేజీ ఆఫర్స్ కొట్టేసిన పూజా.. ఆ హీరో సినిమాలో ఛాన్స్

Rajeev 

16 January 2025

Credit: Instagram

అగ్రహీరోయిన్ గా వెలుగొందిన నటి పూజ హెగ్డే. ఈ అమ్మడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది 

తమిళ్ లో కూడా మంచి స్టార్ డమ్ తెచ్చుకొని సౌత్ లో బిజీగా మారింది. ఇప్పుడు రెండు భాషల్లోనూ సినిమాలు చేస్తుంది. 

పీక్ టైమ్ లోనే పూజ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో చేసింది. 

రీసెంట్ గా ఈ చిన్నది సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. పూజ హెగ్డే నటించిన ఆరు సినిమాలు నిరాశ పరిచాయి

అటు బాలీవుడ్ లోనూ హిట్ అందుకోలేకపోయింది. దాంతో ఈ అమ్మడికి ఆఫర్స్ కరువయ్యాయి. పూజా కూడా చిన్న గ్యాప్ తీసుకుంది. 

పూజ తిరిగి సినిమాల పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే  దళపతి విజయ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.  

 తమిళ్ లో ఈ అమ్మడికి మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది. శివకార్తికేయన్ సినిమాలో ఆఫర్ అందుకుందని తెలుస్తుంది.