వరల్డ్ ఫస్ట్ ట్రిలియనీర్‎గా స్పేస్ ఎక్స్ అధినేత మస్క్.! 

06 September 2025

Prudvi Battula 

ఎలాన్ మస్క్.. ఈ పేరు విన్న వెంటనే గుర్తు వచ్చేది టెస్లా, స్పేస్ ఎక్స్. టెక్నాలజీ అంటే మస్క్.. మస్క్ అంటే టెక్నాలజీ అనేలా చేసారు అయన.

కొత్త కొత్త టెక్నాలజీతో ఎప్పటికి అప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. ఈయన చాలామందికి ఇన్స్పిరేషన్.

ఇదిలా ఉంటె ప్రస్తుతం బిలియనీర్‎గా ఉన్న ఎలాన్ మస్క్ ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‎గా అవతరించే అవకాశముంది.

ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా భవిష్యత్ నిర్దేశిత లక్ష్యాలు CEOగా ఉన్న ఎలాన్ మస్క్ భారీ ప్యాకేజ్ పొందనున్నారు.

ప్రస్తుతం ఆయన $400 బిలియన్లతో ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఉన్నారని మనందరికి కూడా బాగా తెలిసిన విషయమే.

రానున్న పదేళ్లలో టెస్లా విలువ $1.1 ట్రిలియన్ల నుంచి $8.5Tకు చేర్చితే మస్క్ $900B ప్యాకేజీ అందుకుంటారు. అదే జరిగితే ఆయన ఆస్తి $1.3T దాటొచ్చు.

ఇప్పటికే టెస్లా కార్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. త్వరలో డ్రైవర్ లెస్ కార్ కూడా లాంచ్ చేయనున్నారు.

ఈ డ్రైవర్ లెస్ కార్ సక్సెస్ అయితే మాత్రం ఇది భారీగా అమ్ముడుపోవడం కాయం. ఇది ఆయన్ని ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‎గా మారుస్తుంది.