వర్షంలో తడిస్తే నిజంగానే జ్వరం వస్తుందా?

Samatha

19 august  2025

Credit: Instagram

వర్షంలో తడవడం అనేది కామన్. చాలా మంది వర్క్ ఉండి బయటకు వెళ్లినప్పుడు అనుకోకుండా వర్షంలో తడుస్తారు. ఇక చిన్నిపిల్లలు కావాలనే వర్షంలో తడుస్తారు.

అయితే వర్షంలో తడిసే క్రమంలో మన పెద్ద వారు హెచ్చరిస్తుంటారు. వానలో నానకూడదు, వర్షంలో తడవడం వలన జ్వరం వస్తుందని?

మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగానే వర్షంలో తడవడం వల్లనే జ్వరం వస్తుందా? మరేదైనా కారణం ఉందా? కాగా దాని గురించి తెలుసుకుందాం.

దీని పై నిపుణులు ఏమంటున్నారంటే. వర్షంలో తడవడం వల్లే జ్వరం వస్తుందని అవాస్తవం. కానీ వర్షంలో నేరుగా తడవడం కాదు కాని కొన్ని కారణాల వలన ఫీవర్ వస్తదంట.

వర్షంలో తడిసినప్పుడు చర్మం చల్లబడుతుంది. అయితే ఇలా శరీరం చల్లబడినప్పుడు రోగనిరోధక శక్తి తగ్గిపోతుందంట. ఈ క్రమంలో సూక్ష్మక్రిములు లోపలికి వెళ్లడం వలన ఫీవర్ వస్తదంట

చల్లగా లేదా తడిగా ఉండే వాతావరణం, శరీరాన్ని బలహీనపరిచి, ఇన్ఫెక్షన్స్ వచ్చేలా చేస్తుందంట. అందుకే వర్షంలో తడిసిన వెంటనే తలను తడిలేకుండా తుడుచుకొని, వెచ్చటి దుస్తులు ధరించాలంట.

ఎందుకంటే? ఇటువంటి సమయంలో వైరస్‌లు ఫ్లూ, జలుబు లేదా టైఫాయిడ్, న్యుమోనియా, డెంగ్యూ వంటి వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంట.

ఎప్పుడైనా సరే వర్షంలో తడిసన తర్వాత వేడి ఆహారం తీసుకోవాలి.  మంచి పోషకాలు గల ఆహారం తీసుకోవడం వలన జ్వరం వంటివి వచ్చే ఛాన్స్ తగ్గుతుంది.