ఆడవాళ్లకు డార్క్ చాక్లెట్ తప్పనిసరి! ఎందుకు తినాలో తెలుసా?

Jyothi Gadda

11 November 2026

పోషకాలు పుష్కలం- డార్క్ చాక్లెట్‌లో కోకో, ఇతర పోషకాలు అత్యధికంగా ఉంటాయి. ఇది మహిళల సమగ్ర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది.   

నెలసరి నొప్పికి చెక్- ఇందులో కాపర్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి గర్భాశయ కండరాలకు విశ్రాంతినిచ్చి, నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.   

ఐరన్ లోపం దూరం: డార్క్ చాక్లెట్‌లో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. ఇది నెలసరి సమయంలో మహిళల్లో ఐరన్ స్థాయిలు పడిపోకుండా శరీరాన్ని కాపాడుతుంది.   

ఒత్తిడి మాయం: ఇందులో ఉండే మెగ్నీషియం ప్రీ-మెన్‌స్ట్రువల్ సమయంలో మహిళలకు ఎక్కువగా వేధించే మానసిక ఒత్తిడిని, ఆందోళనను దూరం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.   

కార్టిసాల్ లెవెల్స్ డౌన్: రోజూ డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు తగ్గుముఖం పడతాయి.   

మానసిక ప్రశాంతత: దీన్ని తినడం వల్ల మెదడులో ఎండార్ఫిన్లు, సెరటోనిన్, డోపమైన్ వంటి ఫీల్-గుడ్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది.   

మెరుగైన రక్త ప్రసరణ: డార్క్ చాక్లెట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.   

చర్మ సంరక్షణ: రక్త ప్రసరణ మెరుగుపడటంతో పాటు, ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.