మీ గోల్డ్ ప్యూరిటీ టెస్ట్ ఫెయిల్ అయిందా.? ఆ పని చెయ్యండి..
12 October 2025
Prudvi Battula
భారతదేశంలో దసరా తర్వాత ధనత్రయోదశి, దీపావళికి కూడా చాలా మంది ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు.
భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉన్నందున రేట్లు పెరిగిన.. పండుగల వేళ నగలు జనంతో కిటకిటలాడుతాయి.
రోజురోజుకూ రేట్లు పెరుగుతుండటంతో కొందరు వ్యాపారులు కస్టమర్లను మోసం చేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త పడాలి.
మీరు బంగారం కొనే షాప్ వాళ్ళు 22 క్యారెట్ల వస్తువులే ఇస్తున్నారా లేక మోసం చేస్తున్నారా తప్పకుండా గమనించాలి.
బీఐఎస్ హాల్ మార్కింగ్ కలిగిన బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయటం చెయ్యడం మంచిదని అంటున్నారు విశ్లేషకులు.
BIS రూల్స్ 2018 లోని 49వ విభాగం ప్రకారం.. కొనుగోలు చేసిన బంగారు ఆభరణం నిర్దేశిత శుద్ధత కంటే తక్కువగా ఉంటే వ్యాపారి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
ఇక్కడ శుద్ధత లోటు ఆధారంగా వచ్చిన తేడా మొత్తానికి రెండింతలు అలాగే పరీక్షకు అయిన ఛార్జీలతో వ్యాపారి కొనుగోలుదారుడికి నష్ట పరిహారంగా చెల్లించాలి.
పండుగ సమస్యం బంగారం కొనుగోలు చేసే ముందు ఆభరణంపై BIS హాల్‌మార్క్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది మోసపోకుండా కాపాడుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇలా అలంకరిస్తే.. దీపావళి కళ అంతా మీ ఇంట్లోనే..
నల్ల వంకాయ ఆ సమస్యలపై యమపాశం.. అనారోగ్యం ఆమడ దూరం..
బీట్రూట్ జ్యూస్ అంటే.. ఆ సమస్యలకు హడల్.. మీ డైట్లో ఉంటే.. అనారోగ్యం పరార్..