రాత్రి మిగిలిన చపాతీ తింటే.. జరిదేది ఇదే..! మస్ట్‎గా తెలుసుకోండి

02 September 2025

Prudvi Battula 

నిలువ ఉంచిన రోటీ డయాబెటిక్ రోగులకు ఆరోగ్యకరమైన స్నాక్స్‌లో ఒకటి. రోజంతా సంభవించే షుగర్ స్పైక్‌లను నివారించడంలో సహాయపడుతుంది.

చల్లని పాలలో నిలువ ఉంచిన రోటీని నానబెట్టి 10 నిమిషాల నానబెట్టి  తింటే మీ షుగర్ ను కంట్రోల్ చేసేందుకు అద్భుతంగా పనిచేస్తుంది.

ఉదయం పూట ఖాళీ కడుపుతో నిలువ చపాతీని తినడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత, BPని నియంత్రించడంలో సహాయపడుతుంది.

నిలువ ఉన్న చపాతీ మీ రక్తనాళాలను సడలించి, బిపిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ప్రోటీన్ , ఫైబర్ మీ కడుపు జీవక్రియను పెంచుతుంది.

ఉదయం పూట నిలువ ఉంచిన చపాతీ తినడం వల్ల బరువు తగ్గుతారు. నిలువ ఉంచిన చపాతీ గుండెల్లో మంట సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

నిలువ రొట్టెలు చల్లటి పాలతో తీసుకుంటే ఎసిడిటీ, మలబద్ధకం సమస్యను నివారించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

ఎక్కువ సేపు నిల్వ ఉండటం వల్ల చపాతీల రుచి అంతగా బాగుండదు. అలాగే కొన్ని కొన్ని సార్లు ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

దీనివల్ల వాంతులు, జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే ఎక్కువ రోజులు నిల్వ ఉన్న చపాతీలను తినడం మంచిది కాదు అంటున్నారు నిపుణలు.